సల్మాన్‌పై జరీన్‌ ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు..

87
Zareen-Khan (1)

ప్రస్తుతం మోస్ట్‌ ఎల్జిబుల్‌ బ్యాచిలర్‌ ఎవరు అంటే వెంటనే గుర్తోచ్చేది బాలీవడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ పేరు. కెరీర్‌లో ఎంతో మంది హీరోయిన్స్‌తో న‌టించిన స‌ల్మాన్ కొంద‌రితో ప్రేమాయ‌ణం న‌డిపారు. స‌ల్మాన్ జీవితంలో పెళ్లి అనేది ఇప్పటికీ క‌లగానే ఉంది. కొంత కాలం క్రితం లులియా వాంట‌ర్‌తో స‌ల్మాన్ పెళ్లి జ‌ర‌గ‌నుందని వార్తలు వచ్చాయి. కాని అది అక్కడికే పులిస్టాప్ ప‌డింది.

తాజాగా స‌ల్మాన్ న‌న్ను పెళ్లి చేసుకోబోతున్నారు అని బాలీవుడ్ బ్యూటీ చెప్పుతోంది. మరి అమె ఎవరోకాదు బాలీవుడ్ బ్యూటీ జరీన్‌ ఖాన్‌. సల్మాన్‌, జరీన్‌ జంటగా ‘వీర్‌’ చిత్రంలో నటించారు. జరీన్‌ను తొలుత బాలీవుడ్‌కు పరిచయం చేసింది సల్మాన్‌ ఖానే కావడం విశేషం.

Zareen-Khan

ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జరీన్‌ ఖాన్‌ ఈ మేరకు ఫన్నీ కామెంట్‌ చేశారు. ఇంటర్వ్యూ సందర్భంగా ఆమె సినిమాలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘మీపై మీరే ఓ రూమర్‌ సృష్టించాలి. కానీ ఆ రూమర్‌ చాలా వైరల్‌ అవ్వాలి’ అని విలేకరి ఆమెకు ఓ ప్రశ్న వేశారు.

ఇందుకు జరీన్‌ స్పందిస్తూ.. ‘సల్మాన్‌ నన్ను పెళ్లి చేసుకోబోతున్నారు. నాపై ఇలాంటి రూమర్స్‌ చాలా ఫన్నీగా ఉంటాయి. నాకు అసలు పెళ్లిపై నమ్మకం లేదు. చెప్పాలంటే ఈ మధ్యకాలంలో పెళ్లనేది కామెడీగా మారిపోయింది’ అని సమాధానమిచ్చిరు.