ధోని సపోర్టుతోనే రైనాకు అవకాశాలు: యువీ

339
dhoni
- Advertisement -

మహేంద్రసింగ్ ధోనికి సురేష్ రైనా అంటే చాలా ఇష్టమని అందుకే అతనికి చాలా అవకాశాలు ఇచ్చాడని తెలిపారు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్. ప్రతి కెప్టెన్‌కి టీమ్‌లో ఒక ఫేవరెట్ ప్లేయర్ ఉంటాడని…రైనా అంటే ధోనికి ఇష్టమని అందుకే రెగ్యులర్‌గా రైనా జట్టులో కొనసాగాడని వెల్లడించాడు.

రైనాకు ధోరి సపోర్ట్ పుష్కలంగా ఉండేదని…2011 వన్డే ప్రపంచకప్ సమయంలో సురేశ్ రైనా ఫామ్‌లో లేకపోయిన తుదిజట్టులో ఉండేవాడని తెలిపాడు. దీంతో తుదిజట్టు ఎంపిక సెలక్టర్లకు తలనొప్పిగా మారిందన్నాడు. 2011 వన్డే ప్రపంచకప్‌లో ఏడో స్థానంలో బ్యాటింగ్ చేసిన రైనా.. గెలిపించే ఇన్నింగ్స్ ఒక్కటి కూడా ఆడలేకపోయాడని తెలిపాడు.

ధోనీ కెప్టెన్సీలోనే 2007 టీ20 వరల్డ్‌కప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌లో ఆడిన యువరాజ్ సింగ్.. గత ఏడాది వన్డే ప్రపంచకప్ జరుగుతున్న సమయంలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

- Advertisement -