క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన యవరాజ్‌..

20
Yuvraj Singh

టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. తాజాగా ఆయన ప్రత్యేక మీడియా సమావేశంలో ఈ విషయాన్ని తెలిపారు. పదిహేడేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగిన యూవరాజ్‌, తన కెరీర్‌లో 40 టెస్ట్‌లు, 304 వన్డేలు, 58 టీ-20 మ్యాచ్‌లు ఆడాడు.

Yuvraj Singh

ఇక ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్ లు కొట్టిన అరుదైన రికార్డు యూవీ సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో 14, టెస్టుల్లో 3 సెంచరీలు చేశాడు. వన్డేల్లో 111, టెస్టుల్లో 9, టీ-20లలో 28 వికెట్లు తీశాడు.

2011 ప్రపంచకప్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన యువరాజ్‌.. కప్‌ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. 2007 టీ20 ప్రపంచకప్‌ విజయంలోనూ యువరాజ్‌ తన పాత్ర పోషించాడు. 2012లో చివరిగా టెస్టు మ్యాచ్‌ ఆడిన యువీ.. 2017లో ఆఖరి వన్డే, టీ20 ఆడాడు.