పాతనోట్లను తీసుకుంటున్న బీసీసీఐ..!

240
Yuvi Reentry..social media Jokes
- Advertisement -

డిసెంబర్ 31తో పాతనోట్ల చలామణి దేశంలో పూర్తిగా రద్దైన సంగతి తెలిసిందే. ఇక పై పాతనోట్లను కేవలం ఆర్బీఐ బ్యాంకులో మాత్రమే డిపాజిట్ చేసుకునే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. ఇక పై పాత నోట్లు చెల్లవని….రూ.500,రూ.1000 చిత్తు కాగితాలతో సమానమని కేంద్రం స్వయంగా ప్రకటించింది. అయితే, బీసీసీఐ మాత్రం ఇందుకు భిన్నంగా పాతనోట్లను తీసుకుంటుందని ఫోటో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

నోట్ల రద్దు వల్ల దేశానికి కలిగిన ప్రయోజనం నష్టాల సంగతి అలా ఉంచితే… తాజాగా ఆ నోట్లను బీసీసీఐ తీసుకుంటుందంటూ ఆన్ లైన్ లో ఒక పోస్ట్ హల్ చల్ చేసింది. సుదీర్ఘ కాలంపాటు టీమిండియాకు దూరంగా ఉన్న వెటరన్ క్రికెటర్స్ యువరాజ్ సింగ్ అశీష్ నెహ్రాలను తిరిగి ఇంగ్లాండ్ తో జరగనున్న వన్డే టి-20 సిరీస్ లకు సెలక్టర్లు వీరిని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే క్రికెట్ అభిమానులు చాలా మందిని ఈ నిర్ణయం ఆశ్చర్యపరింది.

వీరి ఎంపికపై సోషల్ మీడియాలో నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. యువరాజ్ సింగ్, ఆశిష్ నెహ్రాల ఫోటోలతో పాటు వాటి కింద “బీసీసీఐ ఇప్పటికీ పాత ఐదువందలు వెయ్యి నోట్లను తీసుకుంటుంది” అనే కామెంట్ తో కూడిన ఫోటోను పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ పిక్ ఆన్ లైన్ లో వైరల్ అవుతోంది. ఇప్పటివరకు 85 వేల మంది లైక్ కొట్టగా వేల సంఖ్యలో కామెంట్లను పోస్టు చేస్తున్నారు.

ఇక ఈ ఫోటో అటు తిరిగి ఇటు తిరిగి యువరాజ్ సింగ్ వద్దకు కూడా చేరింది. అయితే ఈ విషయాన్ని సరదాగా తీసుకున్న యూవీ… పిక్ బాగుందని కామెంట్ చేశాడు. అంతేగాదు ఈ ఫోటోను ఇన్ స్టాగ్రాం ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

Yuvi Reentry..social media Jokes

ధోని వన్డే,టీ 20 కెప్టెన్సీ నుంచి దూరం కావటం….బీసీసీఐ యూవీతో పాటు నెహ్రాను జట్టులో తీసుకోవటం చకచక జరిగిపోయింది. దాదాపుగా మూడేళ్ల విరామం తర్వాత యువరాజ్ జట్టులో స్ధానం దక్కించుకోగా…నెహ్రా ఆర్నెళ్ల తర్వాత మళ్లీ టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు.

- Advertisement -