చరిత్ర చెప్పేందుకే ఆ ఫోటోలుః వైటీడీఏ వైస్ చైర్మన్

523
Ytda Chairmen
- Advertisement -

భవిష్యత్ తరాలకు చరిత్ర చెప్పెందుకే యాదాద్రి ఆలయ స్తంభాలపై పలువురి ఫోటోలు చెక్కినట్లు స్పష్టం చేశారు యాదాద్రి టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ (వైటీడీఏ) వైస్ చైర్మన్, సీఈవో కిషన్‌రావు అన్నారు. ఏ దేవాలయంలోనైనా ఆనాటికాలంలోని పరిస్థితులను తెలిపేవిధంగా శిల్పులు శిలలను చెక్కుతారని చెప్పారు. అంతేకానీ వారికి వేరే ఉద్దేశాలు ఉండవని తెలిపారు. స్ధంభాలపై కేసీఆర్ ఒక్కరి ఫోటోనే చెక్కలేదని..మహాత్మాగాంధీ, ఇందిరా గాంధీ కేసీఆర్ కిట్స్, చార్మినార్, తెలంగాణ మ్యాప్, తెలంగాణ ప్రభుత్వ రాజముద్ర , కమలం పువ్వు, ఎడ్లబండి, సైకిల్, కారు, క్రికెట్ ఆట, ముఖ్యమంత్రి కేసీఆర్ తదితర బొమ్మలను చెక్కారని చెప్పారు.

Sculptures

తెలంగాణ ఉద్యమ నాయకుడిగా, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా అనేక సంస్కరణలను కేసీఆర్ తీసుకువచ్చారని, అనేక ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. వెయ్యి సంవత్సరాల తర్వాత కూడా ఈ విషయాలు ప్రజలకు తెలియాలనే శిల్పి హరిప్రసాద్.. కేసీఆర్ బొమ్మను స్తంభంపై చెక్కారని వివరించారు. తాను ఎవరి ప్రోద్బలంతోనూ కేసీఆర్ బొమ్మను చెక్కలేదని, ప్రపంచంలోనే ఒక గొప్ప కట్టడంగా ఉండేలా యాదాద్రి దేవాలయాన్ని పునరుద్ధరించేందుకు అహర్నిశలు కృషిచేస్తున్న కేసీఆర్‌ను దైవసమానుడిగా భావించి, ఆయన బొమ్మను స్తంభంపై చెక్కానని శిల్పి హరిప్రసాద్ లేఖ ద్వారా తెలియజేశారని కిషన్‌రావు చెప్పారు. మొత్తం 5వేల బొమ్మలు ఉన్నాయని ఈ బొమ్మలు ఉన్న స్ధంబాలను బాహ్యప్రాకారంలోనే ఉన్నాయన్నారు. ఆలయం లోపల ఉండే స్థంబాల్లో అన్నీ వైష్ణవ సంప్రదాయం ప్రకారమే చెక్కినట్టు ఆలయ స్థపతి ఆనంద్ సాయి తెలిపారు.

Sculptures

- Advertisement -