సంచలన నిర్ణయం తీసుకున్న జగన్….నెలకు రూ.1 మాత్రమే

425
jagan
- Advertisement -

ఏపీ ముఖ్యమంత్రి వైసిపి అధ్యక్షుడు జగన్ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. విజయవాడలోని ఇందిరా ముస్సిపల్ స్టేడియంలో మధ్యాహ్నం 12.23గంటలకు ఈకార్యక్రమం జరుగనుంది. ఇక ప్రమాణస్వీకారం అనంతరం జగన్ దేనిపైన మొదటి సంతకం చేస్తాడా అన్నది ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక తాజాగా ఉన్న సమాచారం ప్రకారం ప్రమాణస్వీకారానికి ముందే జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. సీఎంగా ఆయన జీతం నెలకు కేవలం ఒక రూపాయి మాత్రమే తీసుకోనున్నట్లు సమాచారం.

ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఏపీ అప్పుల్లో కూరుకుపోయిందని ఖజానాకు తన జీతం భారం కాకూడదని ఆయన భావిస్తున్నారట. జగన్ బాటలోనే కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు నడిచే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూడా ఒక రూపాయి మాత్రమే జీతం తీసుకున్నారు. ఈవిషయంలో జగన్ ఎన్టీఆర్ ను ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం ఏపీ వేతనం నెలకు రెండున్నర లక్షల రూపాయలు ఉంది. జీతం, ఇతర అలవెన్సులు అన్నీ కలిపితే నాలుగైదు లక్షల దాకా వస్తుంది. మంత్రులుకు కూడా సీఎంతో సమానంగా వేతనం, అలవెన్సులు అందుతున్నాయి. తమిళనాడు దివంగత సీఎం జయలలిత కూడా ఒక్కరూపాయి వేతనమే తీసుకునేవారని సమాచారం. పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ కూడా రూపాయికే సీఎం సేవలందిస్తున్నట్లు తెలిసింది.

- Advertisement -