జెరూసలేంకు సీఎం జగన్‌…అమెరికాకు చంద్రబాబు

204
jagan chandrababu

ఏపీ సీఎం, ప్రతిపక్ష నేత విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. సీఎం జగన్ జెరూసలేం పర్యటనకు వెళ్లనుండగా ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోగ్య పరీక్షల కోసం అమెరికా వెళ్లనున్నారు. ఇక ఆగస్టు 1న కుటుంబ సభ్యులతో కలిసి జెరూసలేం వెళ్లనున్న జగన్‌ ఆగష్టు 4 వరకు అక్కడ పర్యటించనున్నారు.

ఆగష్టు 4న రాత్రికి జెరూసలేంలో బయలుదేరి మరునాడు అమరావతికి రానున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి జెరూసలేంలో పర్యటించారు. అలాగే జగన్ సీఎం అయిన తర్వాత తండ్రి మాదిరిగానే జెరూసలేంలో పర్యటించాలని నిర్ణయించుకున్నారు.

చంద్ర‌బాబు ఈనెల 27న ఆయన కుటుంబసభ్యులతో కలిసి అమెరికా వెళ్లనున్నారు. ఆరోగ్య పరీక్షల కోసం నాలుగు రోజుల పాటు అక్కడే వుంటారు. అనంతరం ఆగష్టు 1న తిరిగి ఏపీకి రానున్నారు. గతేడాది కూడా చంద్రబాబు అమెరికాలో ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. రెగ్యులర్ చెకప్‌లో భాగంగా ఆయన అమెరికా వెళుతున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు.