ముగిసిన భేటీ.. జగన్‌కు సీఎం కేసీఆర్‌ ఆహ్వానం..

377
CM kcr
- Advertisement -

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్, కేసీఆర్‌లు సమావేశమైన విషయం తెలిసిందే. కాగా కొద్దిసేపటి క్రితం ఈ భేటీ ముగిసింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని ఏపీ సీఎం జగన్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆహ్వానించారు. తన నివాసానికి విచ్చేసిన కేసీఆర్‌, కేటీఆర్‌ బృందాన్ని జగన్‌ సాదరంగా ఆహ్వానించారు.

అనంతరం కేసీఆర్‌ బృందానికి మధ్యాహ్న భోజన విందు ఏర్పాటు చేశారు. అంతా కలిసి భోజనం చేశాక కేసీఆర్‌ సహా ముఖ్య నేతలతో జగన్‌ సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర విభజన చట్టంలో ఇరు రాష్ట్రాల మధ్య ఎప్పటినుంచో పరిష్కారానికి నోచుకోని సమస్యల పరిష్కారంపై ప్రధానంగా చర్చించారు.

CM kcr

విభజన అంశాలపై ఇద్దరు ముఖ్యమంత్రులు గంటన్నరపాటు చర్చించినట్టు సమాచారం. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై, రెండు రాష్ట్రాల మద్య ఉన్న నీటి వివాదాల పరిష్కారంపై, విద్యుత్ ఉద్యోగులు పంపకాలు, విద్యుత్ బిల్లుల బకాయిలపై 9,10 షెడ్యూల్స్ లోని ప్రభుత్వ రంగ సంస్థల విభజన అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది.

అనంతరం ఇక్కడి నుండి సీఎం కేసీఆర్‌ శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి బయల్దేరి వెళ్లారు. అక్కడ విశాఖ శ్రీ శారదాపీఠ ఉత్తరాధికారి శిష్య తురియాశ్రమ స్వీకార మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్‌, సీఎం కేసీఆర్,వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,ఎంపీ సంతోష్ కుమార్,మాజీ ఎంపీ వినోద్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శేరి శుభాష్ రెడ్డి హాజరైయ్యారు.

- Advertisement -