హైదరాబాద్‌ బోనాలు…ఎస్సైకు ముద్దు పెట్టిన యువకుడు

540
hyderabad bonalu
- Advertisement -

హైదరాబాద్ ఆషాడ బోనాల్లో భాగంగా ఆదివారం నగరమంతా ఎక్కడ చూసిన సందడి వాతావరణం నెలకొంది. అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. ఇక బోనాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు పోలీసులు.

అయితే నల్లకుంటలో బోనాల సందర్భంగా తీసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మందు కిక్కు తలెక్కిందో ఏమో తెలియదు గానీ బోనాల జాతర బందోబస్తులో ఉన్న ఓ ఎస్సైకి ముద్దు ఇచ్చాడు మందుబాబు.

బోనాల ఊరేగింపు బందోబస్తులో ఉన్న ఎస్సై మహేందర్ పక్క నుంచి వెళ్లడాన్ని గమనించిన ఓ యువకుడు ఆయన్ని గట్టిగా పట్టుకుని ముద్దుపెట్టాడు. ఈ హఠాత్ పరిణామంతో షాక్ తిన్న ఎస్సై మహేందర్ యువకుడి చెంప చెళ్లుమనిపించాడు. కోపం వస్తున్నా కంట్రోల్ చేసుకున్న ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్‌గా మారింది.

- Advertisement -