నితిన్ “భీష్మ” ఫస్ట్ లుక్ రిలీజ్..

78
nithin Bheeshama

యంగ్ హీరో నితిన్ గత కొద్ది రోజులుగా ఫెయిల్యూర్స్ తో సతమతమవుతున్నాడు. ప్రస్తుతం ఆయన భీష్మ సినిమాలో నటిస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ ఇటివలే ప్రారంభమైంది. నితిన్ సరసన హీరోయిన్ రష్మీక మందన నటిస్తోంది. ఛలో సినిమా దర్శకుడు వెంకీ కుడుముల ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

ఈసినిమాకు సంబంధించి నితిన్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. డీసెంట్ లుక్ తో నితిన్ ఆకట్టుకుంటున్నాడు. సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్వర సాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈసినిమాతో పాటు నితిన్ మరో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

అఖిల్ అక్కినేనితో మిస్టర్ మజ్ను సినిమాను తెరకెక్కించిన దర్శకుడు వెంకీ అట్లూరీతో రంగ్ దే అనే సినిమాను చేయనున్నాడు. దీంతో పాటు శేఖర్ ఏలేటి దర్శకత్వంలో సినిమా చేసేందుకు సిద్దమయ్యాడు. ఇన్ని రోజులు ఖాళీగా ఉన్న నితిన్ ఒకే సారి మూడు సినిమాలో బిజీగా ఉన్నాడు.