బర్కత్‌పురాలో యాదాద్రి భవన్‌..

119
yadadri bhavan

హైదరాబాద్ బర్కత్‌పురాలో యాదాద్రి భవన్‌ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. మంత్రులుఇంద్రకరణ్ రెడ్డి,తలసాని శ్రీనివాస్ యాదవ్,జగదీశ్ రెడ్డి యాదాద్రి భవన్‌ను ప్రారంభించారు.యాదాద్రి ఆలయ సమాచారం కోసం ఈ భవనాన్ని నిర్మించింది ప్రభుత్వం.

ఈ సందర్బంగా మాట్లాడిన ఇంద్రకరణ్ రెడ్డి భక్తుల సౌకర్యార్థం కోసం రూ. 8 కోట్లతో యాదాద్రి భవన్‌ను నిర్మించామని తెలిపారు. దాదాపు 1600 చ‌ద‌ర‌పు గ‌జాల విస్తీర్ణంలో సెల్లార్, జీ ప్లస్ టూ నిర్మించారని వెల్లడించారు. మొదటి అంతస్తులో కల్యాణ మండపం, రెండో అంతస్తులో 500 మంది సరిపడే భోజనశాలను ఏర్పాటుచేశారన్నారు.

యాదాద్రి శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆర్జిత సేవలు, కల్యాణం, గదుల బుకింగ్ వంటివి ఇక్కడినుంచే బుకింగ్ చేసుకొనే సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. 10,990 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలోని సెల్లార్ ప్రాంతాన్ని పూర్తిగా పార్కింగ్ కు కేటాయించామని చెప్పారు. ఈ ప్రారంభోత్సవంలో ప్రభుత్వ సలహాదారు కె.వి రమణాచారి. ఆలయ ఈవో గీతా తదితరులు పాల్గొన్నారు.