బొమ్మ హిట్టే.. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ట్రైలర్..

293
World Famous Lover
- Advertisement -

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ ‘వరల్డ్ ఫేమస్ లవర్’. క్రాంతిమాధవ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీని కె.ఎస్. రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె.ఎ. వల్లభ నిర్మిస్తున్నారు. విజయ్ సరసన నలుగురు హీరోయిన్లు – రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్ ట్రెసా, ఇజాబెల్లే లెయితే నటిస్తున్నారు. గోపీ సుందర్ సంగీత దర్శకుడు. ఈ సినిమాను ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు.

ఇక ట్రైలర్ విషయానికొస్తే.. “ఈ ప్రపంచంలో నిస్వార్థమైనది ఏదైనా ఉన్నదంటే అది ప్రేమ ఒక్కటే. ఆ ప్రేమలో కూడా నేను అనే రెండక్షరాలు ఓ సునామీనే రేపగలవు. ఐ వాంటెడ్ టు బి ద వరల్డ్ ఫేమస్ లవర్” “నా గుండెకు తగిలిన దెబ్బకి ఆ పెయిన్ తెలవకుండా ఉండాలంటే ఫిజికల్ గా ఈ మాత్రం బ్లీడింగ్ ఉండాలి” అంటు విజయ్‌ చెప్పె డైలాగులు ఆకట్టుకున్నాయి.

ఇందులో నలుగురు కథానాయికలతో విజయ్‌ సాగించిన జర్నీకి సంబంధించిన విజువల్స్ పై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ సీన్స్ పై కట్ చేసిన ఈ ట్రైలర్ అదిరిపోయిందనే చెప్పాలి. డిఫరెంట్ లుక్స్ తో విజయ్ దేవరకొండ చూపించిన వేరియేషన్ బాగుంది. మొత్తంగా ట్రైలర్ చూస్తే విజయ్‌ దేవరకొండ ఈ మూవీతో హిట్‌ అందుకుంటాడనే చెప్పాలి.

https://youtu.be/g8DNVJvE-rE

- Advertisement -