‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఫస్ట్‌ సాంగ్‌ వచ్చేసింది..

431
World Famous Lover
- Advertisement -

క్రాంతిమాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ఈ చిత్రంలో విజయ్ సరసన రాశీఖన్నా, కేథరిన్ ట్రెసా, ఇజబెల్లా లీట్ నటిస్తున్నారు. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్‌ సాంగ్‌ రిలీజైంది. ‘మై లవ్… మనసును మీటే’ అంటూ సాగే ఈ మెలొడీని చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది.

గోపిసుందర్ సంగీతం అందించిన ఈ పాటకు రహ్మాన్ సాహిత్యం సమకూర్చారు. శ్రీకృష్ణ, రమ్య బెహరా గాత్రంలో అందంగా జాలువారిన ఈ పాట గురించి విజయ్ దేవరకొండ ట్విట్టర్‌లో స్పందించారు. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంలోని తొలిపాట ఓ అందమైన భావన అని పేర్కొన్నారు. ఈ పాట తనను అన్ని మధుర క్షణాల గురించి ఆలోచించేలా చేసిందని విజయ్‌ వివరించారు.

- Advertisement -