`వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌` ఫస్ట్‌ సింగిల్..!

261
World Famous Lover

డిఫ‌రెంట్ కాన్సెప్ట్ చిత్రాల‌తో అన్నివ‌ర్గాల‌ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్న క్రేజీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తోన్న తాజా చిత్రం `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌`. వేలంటెన్స్ డే సంద‌ర్భంగా ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 14న విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమాతో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకోవ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.

Vijay Devarakonda

క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై వల్లభ నిర్మించిన ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతాన్ని అందించాడు. ఆయన బాణీల్లోని ‘మై లవ్’ అనే పాటను ఫస్ట్‌ సింగిల్ గా వదలనున్నారు.

ఈ నెల 20వ తేదీ సాయంత్రం 4 గంటల 05 నిమిషాలకి ఫస్టు సింగిల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేశారు. మ్యూజిక్ వింటూ నాయకా నాయికలు ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నారు.