ట్రెండింగ్ లో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఫస్ట్ సింగిల్

100
wfl

సంచలన యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ ఇంటెన్స్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘వరల్డ్ ఫేమస్ లవర్’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. క్రాంతిమాధవ్ డైరెక్ట్ చేస్తొన్న ఈ సినిమాలో రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్ ట్రెసా, ఇజాబెల్లే లెయితే హీరోయిన్లు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు.

ఇటీవల చిత్ర బృందం ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ ‘మై లవ్’ను రిలీజ్ చేసింది. గోపీసుందర్ వినసొంపైన బాణీలు, రెహమాన్ ఆకట్టుకొనే సాహిత్యం, శ్రీకృష్ణ, రమ్యా బెహరా మధుర గానం కలిసి హృదయాన్ని హత్తుకొనే మేలోడీగా ఈ పాట తయారైంది. నలుగురు హీరోయిన్లతోనూ విజయ్ దేవరకొండ పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయినట్లు ఈ పాటలో కనిపిస్తున్నాడు. కాగా సంగీత ప్రియుల్ని విశేషంగా ఆకర్షిస్తోన్న ఈ చార్ట్ బస్టర్ రొమాంటిక్ సాంగ్ యూట్యూబ్ లో 2 మిలియన్ వ్యూస్ దాటి దూసుకుపోతోంది.క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎ. వల్లభ నిర్మిస్తోన్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ను కె.ఎస్. రామారావు సమర్పిస్తున్నారు. ఫిబ్రవరి 14న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.