ప్రపంచకప్‌..అగ్రస్ధానంలో కీవిస్

178
newzealand

ప్రపంచక్‌ మ్యాచ్‌లకు వరణుడు అడ్డంకిగా మారాడు. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు కావడంతో క్రికెట్ ఫ్యాన్స్‌ నిరాశపడుతున్నారు.ఇక భారత్-న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ కూడా వర్షం కారణంగా రద్దు కావడంతో అభిమానులు నిరాశతో వెనుదిరిగారు. దీంతో భారత్‌-న్యూజిలాండ్ జట్లకు చెరో పాయింట్ దక్కింది.

ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ అగ్రస్ధానంలో కొనసాగుతోంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన కీవిస్‌ ఆరు పాయింట్లు సాధించింది. ఇక భారత్‌తో మ్యాచ్ రద్దు కావడంతో ఒక పాయింట్ రాగా పాయింట్స్‌ టేబుల్‌లో అగ్రస్ధానంలో నిలిచింది.

భారత్ ఈ సారి ప్రపంచ్ గెలవడం ఖాయమని ఎనలిస్టులతో పాటు మాజీ ఆటగాళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సైతం భారత్ విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌, ఇంగ్లాండ్‌ తలపడే అవకాశముందని..భారత్ గెలుస్తుందన్నారు.