ఇంగ్లండ్‌పై శ్రీలంక విజయ భేరి..

96
England vs Sri Lanka

ప్రపంచకప్‌లో భాగంగా లీడ్స్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. ఈ ప్రపంచకప్‌లో భారీ స్కోర్లను అలవోకగా బాదేస్తున్న ఇంగ్లండ్.. ప్రత్యర్థి నిర్దేశించిన స్వల్ప విజయ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆపసోపాలు పడి చివరికి మరో 20 పరుగుల ముందే చేతులెత్తేసి ఓటమి పాలైంది.

శ్రీలంక బౌలర్ లసిత్ మలింగ, ధనంజయ డి సిల్వా దెబ్బకు కకావికలైన ఇంగ్లండ్ ఓటమిని తప్పించుకోలేకపోయింది. జో రూట్ (57), బెన్ స్టోక్స్ (82-నాటౌట్)లు కాసేపు ప్రతిఘటించినా పరాజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయారు. మలింగ 4, డి సిల్వా 3 వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను దారుణంగా దెబ్బకొట్టారు. దీంతో మరో మూడు ఓవర్లు మిగిలి ఉండగానే 212 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్ అయింది.

England vs Sri Lanka

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే షాక్‌ తగిలింది. మూడు ఓవర్లు కూడా పూర్తి కాకుండానే కరుణరత్నె (1), కుశాల్‌ పెరీరా (2) వికెట్లు కోల్పోయింది. ఈ స్థితిలో అవిష్క ఫెర్నాండో (49), కుశాల్‌ మెండిస్‌ (46) నిలబడడంతో లంక కోలుకుంది. ధాటిగా ఆడిన అవిష్క ఔటైనా.. కుశాల్‌, మాథ్యూస్‌తో కలిసి ముందుకు సాగడంతో లంక ఒక దశలో 133/2తో మంచి స్థితిలోనే నిలిచింది. ఎదురుదాడికి దిగే క్రమంలో కుశాల్‌తో పాటు జీవన్‌ మెండిస్‌ (0) కూడా వెనుదిరిగారు. మాథ్యూస్‌, ధనంజయ డిసిల్వా (29) అండతో స్కోరు పెంచాడు. ఈ దశలో ఆర్చర్‌ (3/52), వుడ్‌ (3/40) కట్టుదిట్టంగా బంతులేయడంతో లంక వేగంగా పరుగులు చేయలేకపోయింది. పైగా క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. మాథ్యూస్‌ ఆఖరిదాకా పోరాడటంతో ఆ జట్టు ఆ మోస్తారు స్కోరైనా చేయగలిగింది.

స్కోరు వివరాలు
శ్రీలంక ఇన్నింగ్స్‌: కరుణరత్నే (సి) బట్లర్‌ (బి) ఆర్చర్‌ 1; కుశాల్‌ పెరీరా (సి) అలీ (బి) వోక్స్‌ 2; ఫెర్నాండో (సి) రషీద్‌ (బి) వుడ్‌ 49; కుశాల్‌ మెండిస్‌ (సి) మోర్గాన్‌ (బి) రషీద్‌ 46; మాథ్యూస్‌ (నాటౌట్‌) 85; జీవన్‌ మెండిస్‌ (సి అండ్‌ బి) రషీద్‌ 0; ధనంజయ డిసిల్వా (సి) రూట్‌ (బి) ఆర్చర్‌ 29; తిసారా పెరీరా (సి) రషీద్‌ (బి) ఆర్చర్‌ 2; ఉదాన (సి) రూట్‌ (బి) వుడ్‌ 6; మలింగ (బి) వుడ్‌ 1; ప్రదీప్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 232.

వికెట్ల పతనం: 1–3, 2–3, 3–62, 4–133, 5–133, 6–190, 7–200, 8–209, 9–220.

బౌలింగ్‌: వోక్స్‌ 5–0–22–1, ఆర్చర్‌ 10–2–52–3, వుడ్‌ 8–0–40–3, స్టోక్స్‌ 5–0–16–0, మొయిన్‌ అలీ 10–0–40–0, రషీద్‌ 10–0–45–2, రూట్‌ 2–0–13–0.

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: విన్స్‌ (సి) కుశాల్‌ మెండిస్‌ (బి) మలింగ 14; బెయిర్‌స్టో (ఎల్బీడబ్ల్యూ) (బి) మలింగ 0; రూట్‌ (సి) కుశాల్‌ పెరీరా (బి) మలింగ 57; మోర్గాన్‌ (సి అండ్‌ బి) ఉదాన 21; స్టోక్స్‌ (నాటౌట్‌) 82; బట్లర్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) మలింగ 10; మొయిన్‌ అలీ (సి) ఉదాన (బి) ధనంజయ డిసిల్వా 16; వోక్స్‌ (సి) కుశాల్‌ పెరీరా (బి) ధనంజయ డిసిల్వా 2; రషీద్‌ (సి) కుశాల్‌ పెరీరా (బి) ధనంజయ 1; ఆర్చర్‌ (సి) తిసారా పెరీరా (బి) ఉదాన 3; వుడ్‌ (సి) కుశాల్‌ పెరీరా (బి) ప్రదీప్‌ 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (47 ఓవర్లలో ఆలౌట్‌) 212.

వికెట్ల పతనం: 1–1, 2–26, 3–73, 4–127, 5–144, 6–170, 7–176, 8–178, 9–186, 10–212.

బౌలింగ్‌: మలింగ 10–1–43–4, ప్రదీప్‌ 10–1–38–1, ధనంజయ డిసిల్వా 8–0–32–3, తిసారా పెరీరా 8–0–34–0, ఉదాన 8–0–41–2, జీవన్‌ 3–0–23–0.