భారత్‌ బ్యాటింగ్‌.. పాక్‌ బౌలింగ్‌..

292
India vs Pakistan
- Advertisement -

ప్రపంచ క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణాలు రానేవచ్చాయి. వరల్డ్ కప్‌లో భారత్, పాకిస్థాన్ సమరం మరికాసేపట్లో మొదలుకానుంది. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ ప్రపంచకప్ ఈవెంట్లో దాయాదుల సమరానికి మాంచెస్టర్ ఆతిథ్యమిస్తోంది. ఈ చిరకాల ప్రత్యర్థుల సమరంలో పాకిస్థాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. వరుస విజయాలతో దూకుడు మీదున్న టీమిండియా..పాక్‌ను కట్టడి చేసి మరో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. మరోవైపు భారత్‌ను ఓడించాలన్న కసితో పాక్‌ కూడా సన్నద్ధమయింది.

భారత జట్టు: రోహిత్‌ శర్మ, లోకేశ్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ, విజయ్‌ శంకర్‌, ఎంస్‌ ధోనీ, కేదార్‌ జాదవ్‌, హార్దిక్‌ పాండ్య, భువనేశ్వర్‌ కుమార్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, యుజువేంద్ర చాహల్‌, జస్ప్రీత్‌ బుమ్రా.

పాకిస్థాన్‌ జట్టు: ఇమాముల్‌ హక్‌, ఫకార్‌ జమాన్‌, బాబర్‌ అజామ్‌, మహమ్మద్‌ హఫీజ్‌, సర్ఫరాజ్‌ అహ్మద్‌, షోయబ్‌ మాలిక్‌, ఇమాద్‌ వసీం, షాదాబ్ ఖాన్‌, హసన్‌ అలీ, వహాబ్‌ రియాజ్‌, మహమ్మద్‌ అమీర్‌.

- Advertisement -