రోహిత్ సెంచరీ.. ఇండియా ఆరంభం అదిరింది

344
India Won
- Advertisement -

ప్రపంచకప్ తొలి మ్యాచ్ లో దక్షిణాఫ్రికాతో విజయం సాధించింది ఇండియా. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సఫారీలపై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందారు. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా నిర్ణిత 50ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 227పరుగులు చేసింది.

యుజ్వేంద్ర చాహల్ 4 వికెట్లు తీయగా…భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రాలు రెండేసి వికెట్లతో సరిపెట్టుకున్నారు. దీంతో టీంఇండయా బౌలర్లు సఫారీలను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌లలో క్రిస్ మోరిస్ 42పరుగులు తప్ప మిగతా వారు ఎవరూ పెద్దగా ఆడలేదు.

228పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియాకు మొదట్లోనే ఎదురుదెబ్బ తగిలింది. 13పరుగుల వద్ద ఓపెనర్ శిఖర్ ధవన్ 8పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆతర్వాత వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి 18పరుగులకే వెనుదిరిగాడు. ఆతర్వాత వచ్చిన రాహుల్ 26పరుగులు చేయగా, ధోని 34పరుగులు చేసి అవుట్ అయ్యాడు. చివరగా వచ్చిన హర్దిక్ పాండ్యా 15పరుగులు చేసి మ్యాచ్ ను ఫినిషింగ్ ఇచ్చేశాడు. ఓపెనర్ రోహిత్ శర్మ 122పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో రోహిత్ శర్మకు ప్లేయర్ ఆప్ మ్యాచ్ అవార్డు దక్కింది.

- Advertisement -