రజినీతో చేయడం థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్..

606
- Advertisement -

సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్ట‌ర్ ఏఆర్‌ మురుగదాస్‌ల ఫ‌స్ట్ క్రేజి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం `దర్బార్`. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో, హైటెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రజినీ ఒక ప‌వ‌ర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న‌ సినిమాను అన్ని రకాల కమర్షియల్ హంగులతో మురుగదాస్ తెరకెక్కిస్తున్నారు.

లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుధ్‌ ర‌విచంద్ర‌న్ సంగీతం అందిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన `దర్బార్` మోషన్ పోస్టర్‌కి ప్రపంచ వ్యాప్తంగా ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది. లేటెస్ట్‌గా ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సూపర్ స్టార్ రజినీ నవంబర్ 14 నుండి డబ్బింగ్ స్టార్ట్ చేసి నేటితో పూర్తి చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయనున్నారు.

darbar1

ఈ సందర్భంగా దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ మాట్లాడుతూ, “సూపర్ స్టార్ రజినీకాంత్‌తో దర్బార్ చేయడం థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. అలాగే ఆయనతో చేసిన ఈ డబ్బింగ్ సెషన్ నా లైఫ్‌లో మెమొరబుల్.” అన్నారు

రజినీకాంత్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నివేత థామస్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తుంది, సునీల్ శెట్టి, తంబీ రామయ్య, యోగి బాబు, ప్రతీక్ బబ్బర్, నవాబ్ షా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫి: స‌ంతోష్ శివ‌న్‌, మ్యూజిక్: అనిరుద్ ర‌వి చంద్ర‌న్, ఎడిట‌ర్: శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్, నిర్మాత: ఎ.సుభాస్కరన్, ద‌ర్శ‌క‌త్వం: ఎ.ఆర్. మురుగదాస్‌

Superstar Rajinikanth’s latest film ‘Darbar’ Directed by Star Director AR Murugadoss is gearing up to release for Sankranthi.

- Advertisement -