జీఎస్టీ బకాయిలు, ఇతర బడ్జెట్‌ కేటాయింపులపై కేంద్రాన్ని నిలదీస్తాం

320
kk
- Advertisement -

తెలంగాణకు రావాల్సిన జీఎస్టీ బకాయిలు, ఇతర బడ్జెట్ కేటాయింపులపై కేంద్రాన్ని నిలదీస్తాం అన్నారు పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. తెలంగాణ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు హాజరయ్యారు. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై కేటీఆర్‌ దిశానిర్దేశం చేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయాన్ని అభినందిస్తూ పార్లమెంటరీ పార్టీ తీర్మానం చేసింది.

mps

అనంతరం ఎంపీ కేశవరావు మాట్లాడుతూ.. నీటి పారుదల రంగంలో తెలంగాణ చేపట్టిన కార్యక్రమాలు మరో రాష్ట్రం చేయలేదు. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిల గురించి పార్లమెంటులో అడుగుతాం అన్నారు. వివిధ రంగాల కింద మాకు పన్ను బకాయిలు రావాల్సి ఉంది. జీఎస్టీ బకాయిలు, ఇతర బడ్జెట్‌ కేటాయింపులపై కేంద్రాన్ని నిలదీస్తాం. సీఏఏపై సీఎం కేసీఆర్‌ స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారు.

- Advertisement -