మహిళల టీ20 ప్రపంచకప్‌.. భారత్ శుభారంభం

426
womens
- Advertisement -

ఆస్ట్రేలియాతో ఇండియా మహిళల వరల్డ్ కప్ జరుగుతున్న సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై భారత్‌ 17 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణిత 20ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 132పరుగులు చేశారు. దీప్తి శర్మ 46 బంతుల్లో 49పరుగులు చేయగా, షఫాలీ వర్మ(29), జెమీమా రోడ్రిగ్స్‌ 26 పరుగులు చేశారు. . కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ కేవలం రెండు పరుగులకే వెనుదిరగడంతో భారత్‌ భారీ స్కోరు చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. భారత బౌలర్లలో పూనమ్‌ యాదవ్‌ 4, శిఖా పాండే3 వికెట్లు పడగొట్టారు.

అనంతరం 133పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు 19.5 ఓవర్లలో 115 పరుగులకే ఆల్ అవుట్ అయ్యారు. ఓపెనర్‌ అలీసా హీలీ 31 బంతుల్లో 51పరుగులు చేశారు. మిగతా వారంతో సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు. ఆఖరివరకు ఉత్కంఠగా సాగినప్పటికీ భారత బౌలర్లు పట్టువదలకుండా పోరాడటంతో ఆసీస్‌ మరో బంతి మిగిలుండగానే ఆలౌటైంది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును పూనమ్‌ అందుకుంది.

- Advertisement -