74 ఏళ్ల బామ్మ..కవలలకు జన్మనిచ్చింది

491
guntur
- Advertisement -

74 ఏళ్ల వయసులో కవలలకు జన్మనిచ్చి వార్తల్లో నిలిచింది ఓ బామ్మ. పెళ్లయిన 57 ఏళ్ల తర్వాత ప్రెగ్నెంట్ అయిన బామ్మ ఇవాళ కవల పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లితో పాటు ఇద్దరు పిల్లలు క్షేమంగా ఉన్నారు. కుటుంబ సభ్యుల్లో మొఖంలో సంతోషం వెల్లివిరుస్తోంది.

తూర్పుగోదావరి జిల్లా నెలపర్తిపూడి గ్రామానికి చెందిన యర్రమట్టి రామరాజారావుతో మంగాయమ్మకు 1962లో వివాహమైంది. ఈ దంపతులు వివాహమైన నాటి నుంచి సంతానం కోసం ప్రయత్నించారు. మంగాయమ్మకు 73 ఏళ్లు రావడంతో పిల్లలు పుట్టడం లేదన్న బాధతో వారు గతేడాది చెన్నై వెళ్లి ఐవీఎఫ్‌ (ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌) ద్వారా సంతానం పొందాలని చేసిన ప్రయత్నం విఫలమైంది.

2018లో ఆ దంపతులు గుంటూరు అహల్యా ఆస్పత్రిని సంప్రదించగా.. ఐవీఎఫ్‌ పద్ధతిలో భార్య గర్భం దాల్చింది. వైద్య నిపుణుడు శనక్కాయల ఉదయ్‌శంకర్‌ పర్యవేక్షణలో రోజూ వైద్య పరీక్షలు నిర్వహిస్తూ తల్లి, గర్భంలో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఫలితంగా కవలలకు జన్మనిచ్చింది.

గతంలో 70 ఏళ్లకు ప్రసవం ప్రపంచ రికార్డుగా ఉంది. కాగా ఇప్పుడు 73 ఏళ్ల వయసులో ప్రసవం ద్వారా అరుదైన రికార్డు నెలకొంది.

- Advertisement -