కాళేశ్వరం నీరు.. వచ్చే ఏడాది నుంచే..

227
- Advertisement -

బ్యారేజీలు, రిజర్వాయర్ల నిర్మాణాల కన్న ముందే కాలువల నిర్మాణం పూర్తి చేసి వచ్చే ఏడాదే నుండే కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని చెరువుల ద్వారా పంట పొలాలకు నీరందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు.

గత ఏడాది ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా చెరువులు నింపడం వల్ల 9 లక్షల ఎకరాల్లో పంట పండిందని, దీని విలువ 4,725 కోట్ల రూపాయలని సీఎం చెప్పారు. 10 వేల కోట్ల రూపాయల వ్యయం చేస్తే దానికి వందల రెట్ల పంట చేతికొస్తుందని చెప్పారు.

 Will complete Kaleshwaram project by Dec 2017

ఇదే స్పూర్తితో కాళేశ్వరం కాలువలు కూడా నిర్మించాలని, వాటి ద్వారా చెరువులు నింపాలని సిఎం కోరారు. గోదావరి నదిలో ప్రాణహిత, ఇంద్రావతి కలిసిన తరువాత ఎంతో నీరు లభ్యం అవుతుందని, తెలంగాణ వాటా ప్రకారం వాడుకుంటే భవిష్యత్తులో నీటి కొరతే వుండదని సిఎం అన్నారు. ప్రాజెక్టుల ద్వారా నీరందించలేని ప్రాంతాల్లో చిన్న నీటి వనరులను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.

మొత్తంగా తెలంగాణలో ఏడాదికి లక్షా 25 వేల కోట్ల రూపాయల పంట పండుతుందని, ఇది వార్షిక బడ్జెట్ కు సమానమని సిఎం అన్నారు. ప్రగతి భవన్ లో మంగళవారం నీటి పారుదల ప్రాజెక్టులపై సీఎం సమిక్ష నిర్వహించారు. నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, ముఖ్య కార్యదర్శి శాంతికూమారి, కార్యదర్శి స్మితా సభర్వాల్, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, సినీయర్ అధికారులు మురళీధర్, హరే రామ్ తదితరులు పాల్గొన్నారు.

Will complete Kaleshwaram project by Dec 2017

కొండపోచమ్మ సాగర్ నిలువ సామర్ద్యం పెంచిన తరువాత రూపొందించిన డిజైన్లను సిఎం పరిశీలించి ఆమోదించారు. 15 టిఎంసీల సామర్ద్యంతో నిర్మించే కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ కు వెంటనే టెండర్లు పిలిచి 8 నుండి 10 నెలల సమయంలోనే పూర్తి చేయాలని సిఎం ఆదేశించారు. తెలంగాణలో కోటి ఎకరాలకు నీరందించడానికి లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్వహించడానికి అవసరమైన విద్యుత్ ను అందించడానికి ట్రాన్స్ కో ఏర్పాట్లు చేసిందని సిఎం వెల్లడించారు.

లిప్ట్ ఇరిగేషన్ విద్యుత్ బిల్లులు నీటి పారుదల శాఖ ద్వారా ప్రభుత్వమే చెల్లిస్తుందని సిఎం మరోసారి స్పష్టం చేశారు. వ్యవసాయం కోసం పెట్టే ఖర్చును ప్రభుత్వం రైతుల కోసం పెట్టే పెట్టుబడిగా భావిస్తుంది తప్ప భారంగా పరిగణించదని సీఎం అన్నారు. ప్రస్తుతం భారీ నీటి పారుదల ప్రాజెక్టులు నిర్మించే పనిలో వున్న నీటి పారుదల శాఖ భవిష్యత్తులో ప్రాజేక్టుల నిర్వహణకు అనుగుణంగా పునర్ నిర్మాణం కావాలని సీఎం సూచించారు. ఇఎన్సీ, సిఇలు ఎంతమంది వుండాలి? వారెక్కడ పనిచేయాలి? అనే విషయంలో స్పష్టత వుండాలన్నారు. అధికార యంత్రాంగమంతా హైదరాబాద్ లోనే కేంద్రీకృతం కాకుండా క్షేత్ర స్థాయికి విస్తరించాలని సీఎం సూచించారు. అంతేకాకుండా సమైక్య ఆంద్రప్రదేశ్‌లో.. ఆంద్ర ప్రాంతానికి అనుకూలంగా అధికారుల వ్యవస్థను ఏర్పాటు చేశారని చెప్పారు. ఇప్పుడు తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులు, 31 జిల్లాలకు అనుగుణంగా నీటి పారుదల శాఖ అధికారిక వ్యవస్థ వుండాలని సూచించారు.

- Advertisement -