రివ్యూ : వేర్ ఈజ్ ది వెంక‌ట‌ల‌క్ష్మి

113
Where Is The Venkatalakshmi movie review

విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో హర్రర్ కామెడీగా తెరకెక్కిన చిత్రం వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి. రాయ్ లక్ష్మీ,పూజిత పొన్నాడ ప్రధానపాత్రలో కార్తీక్,ప్రవీణ్,మధు కీలకపాత్రల్లో నటించగా గా కిషోర్ కుమార్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇవాళ ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది..?ఎంతవరకు భయపెట్టి…నవ్వులు పూయించిందో చూద్దాం…

కథ:

ఏ పని లేకుండా అల్లరిపనులు చేస్తూ జులాయిగా తిరిగే కుర్రాళ్లు చంటి (ప్ర‌వీణ్‌), పండు (మ‌ధునంద‌న్‌). ఎవ్వ‌రినీ లెక్క‌చేయ‌ని వీళ్లు, స్నేహితుడైన శేఖ‌ర్ (రామ్‌కార్తీక్‌) మాట మాత్రం వింటుంటారు. ఆ ఊళ్లోకి టీచర్‌గా వస్తుంది వెంక‌ట‌లక్ష్మి (రాయ్‌ లక్ష్మి). వెంకటలక్ష్మీని తొలిచూపులోనే ప్రేమించే చంటి,పండు ఆమె చెప్పింద‌ల్లా చేస్తుంటారు. సీన్ కట్ చేస్తే వెంకటలక్ష్మీ దెయ్యం అని తెలిసి షాక్ అవుతారు..?వెంకటలక్ష్మి వారిని ఎలా వదిలిపెడుతుంది..?ఆ చిక్కుల నుండి వారు ఎలాబయటపడతారు..అన్నదే సినిమా కథ.

Image result for where is venkatalaxmi

 

ప్లస్ పాయింట్స్ :

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ పాటలు,కథా,నేపథ్యం. ప్ర‌వీణ్‌, మ‌ధునంద‌న్ పండు, చంటి పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. వీరు చేసే కామెడీ సినిమాకే హైలైట్‌. సినిమాలో మరో హైలైట్ రాయ్ లక్ష్మీ. తన అందంతో సినిమాకు మరింత గ్లామర్ తెచ్చింది. మిగితా నటుల్లో రామ్ కార్తీక్,పుజితా పొన్నాడ పర్వాలేదనిపించారు.

మైనస్ పాయింట్స్ :

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ లాజిక్ లేని సన్నివేశాలు, క‌థ‌నం,థ్రిల్లింగ్ అంశాలు లేకపోవడం. ఇలాంటి చిత్రాల్లో డ్రామా పండిందంటే లాజిక్‌ల గురించి ఆలోచించ‌డం మానేస్తారు ప్రేక్ష‌కులు. కానీ ఏ ద‌శ‌లోనూ డ్రామా పండ‌దు. అడుగ‌డుగునా సినిమాలో లోపాలు క‌నిపిస్తుంటాయి. ఏ పాత్ర ఎప్పుడు వస్తుందో అర్ధం కాదు.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా పర్వాలేదు. ద‌ర్శ‌కుడు కిషోర్ కుమార్ క‌థ‌ని ఏ ద‌శ‌లోనూ ఆస‌క్తిక‌రంగా చెప్ప‌లేక‌పోయారు. వెంక‌ట్ సినిమాటోగ్రఫీ, హ‌రి గౌర సంగీతం ప‌ర్వాలేద‌నిపిస్తుంది. కిర‌ణ్ మాట‌లు అక్క‌డ‌క్క‌డా మెప్పిస్తాయి.ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయికి త‌గ్గ‌ట్టున్నాయి.

తీర్పు:

ఊళ్లో అంద‌రితోనూ చీవాట్లు తినే ఇద్ద‌రు కుర్రాళ్లు. ఊరంత‌టికీ ఉప‌యోగ‌ప‌డే ఓ మంచి ప‌ని చేసే క‌థతోనే ఈ చిత్రం తెర‌కెక్కింది. ఇటీవలి కాంలో తెలుగులో ట్రెండ్ సెట్ అయిన హర్రర్ కామెడి జోనర్‌ని ఎంచుకుని సినిమాను తెరకెక్కించారు దర్శకుడు కిషోర్ కుమార్.పాటలు,కథ సినిమాకు ప్లస్ పాయింట్‌కాగా లాజిక్ లేని సన్నివేశాలు,థ్రిల్లింగ్ అంశాలు లేకపోవడం మైనస్ పాయింట్స్‌.. ఓవరాల్‌గా పర్వాలేదనిపించే మూవీ వేర్ ఈజ్ వెంకటలక్ష్మీ.

విడుదల తేదీ:15/03/2019
రేటింగ్:2.25 /5
న‌టీన‌టులు: రాయ్ లక్ష్మి‌, రామ్‌ కార్తీక్‌, పూజిత పొన్నాడ‌,
సంగీతం: హ‌రి గౌర‌
నిర్మాత‌లు: ఆనంద్‌రెడ్డి, శ్రీధ‌ర్‌రెడ్డి
ద‌ర్శ‌క‌త్వం: కిషోర్ కుమార్