వాట్సాప్‌ సరికొత్త ఫీచర్‌…కాల్ వెయిటింగ్

404
whatsapp
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు వాడుతున్న ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్‌ వాట్సప్. ఎన్నో ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్‌లు అందుబాటులోకి వచ్చినా.. వాట్సప్ ఆకట్టుకున్నంతగా ఆకర్షించలేకపోయాయి. క్వాలిటీ ఫీచర్స్‌ను అందించే ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్‌గా పేరుగాంచిన వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.

అదే కాల్ వెయిటింగ్. ఇప్పటివరకు మనం వేరే వారితో కాల్ మాట్లాడేటప్పుడు మనకు ఎవరైనా కాల్ చేస్తే ఆ విషయం మనకు తెలిసేంది. కాల్ ఎమర్జెన్సీ అయితే ప్రస్తుతం మాట్లాడే కాల్ హోల్డ్ లో పెట్టి వారితో మాట్లాడే సదుపాయం ఉండేది.

ఇకపై అలాంటి ఫీచరే వాట్సాప్‌లో కనిపించనుంది. అంటే మనం వాట్సాప్ లో ఎవరితో అయినా కాల్ మాట్లాడుతుంటే.. అదే సమయానికి మనకు వేరే వారు కాల్ చేస్తే కాల్ వెయిటింగ్ వస్తుందన్న మాట. ఈ ఫీచర్ కేవలం ఆడియో కాల్స్ కు మాత్రమే కాకుండా వీడియో కాల్స్ కు కూడా అందుబాటులోకి రానుంది.

అయితే.. ఇందులో కాల్ వెయిటింగ్ వచ్చింది కానీ హోల్డ్ ఆప్షన్ ను అందించలేదు. అంటే మీరు వెయిటింగ్ లో ఉన్న కాల్ మాట్లాడాలి అనుకుంటే.. ప్రస్తుతం మాట్లాడే కాల్ ను కట్ చేయాల్సిందే. అయితే ఈ ఫీచర్‌ని త్వరలో అప్‌గ్రేడ్ చేసి వినియోగదారులకు అందించే అవకాశం ఉంది.

- Advertisement -