May Day:కార్మిక దినోత్సవం

605
may day
- Advertisement -

పనిగంటల పోరాటంలో అసువులు బాసిన అమరుల రుధిరం నుంచి ఉద్భవించిందే ఎర్రజెండా..! 1886లో చికాగోలో జరిగిన పోరాట ఫలితంగా ఎనిమిది గంటల పనిదినం అమల్లోకి వచ్చిన రోజే మేడే. జిల్లాలో వెట్టివిముక్తి కోసం జరిగిన ఉద్యమం కారణంగా వందలాది మంది చెర నుంచి విముక్తులయ్యారు. ఆ తర్వాత బీడీ కార్మికులు ఏకమై నిర్వ హించిన పోరాటాలకు అప్పటి ప్రభుత్వాలు దిగిరాక తప్ప లేదు. పోరుబాటకు బాసటగా నిలిచిన మేడేను ఘనంగా నిర్వహించుకునేందుకు తెలంగాణ కార్మిక లోకం సిద్ధమైంది. ఈ సంధర్బంగా రాష్ట్ర ప్రజలు, కార్మికులకు సీఎం కేసీఆర్ మేడే శుభాకాంక్షలు తెలియజేశారు.  కార్మిక లోకమంతా క్షేమంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.

కార్మిక ఉద్యమంలో పోరాటానికీ, త్యాగానికీ, అమరత్వానికీ మే దినోత్సవం ప్రతీకగా నిలుస్తోంది. 1886 నాటికి ప్రపంచంలో కార్మికులు దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్నారు. అమెరికాలో కార్మికవర్గం విస్తృతంగా ఉన్నప్పటికీ, అక్కడ కూడా సమా న పనికి సమాన వేతనం ఇవ్వకపోవటం, పని గంటలు ఎక్కువగా ఉంటూ శ్రమదోపిడీ చేయటం జరిగేది. ఈ పరిస్థితుల్లో రోజుకు ఎనిమిది గంటల పని కంటే ఎక్కువ ఉండరాదన్న డిమాండ్ ఏర్పడింది. 1886 మే 1న సమ్మె చేయాలన్న వివిధ కార్మిక సంఘాల పిలుపుతో అమెరికాలోని చికాగో నగరాన్ని లక్షలాది మంది కార్మికులు ముంచెత్తారు. ఆ నగరంలోని హే మార్కెట్ చౌరస్తాలో కార్మికుల ప్రదర్శన హింసాత్మకంగా మారింది.

Also Read:దీనిపై కూడా రాజకీయమా.. తూ!

సమ్మె చేస్తున్న కార్మికులు నిర్వహించుకుంటున్న సభపై పోలీసులు కాల్పులు జరపటంతో ఆరుగురు కార్మికులు అమరులయ్యారు. అదుగో… చికాగోలో ఆనాడు చిమ్మి న కార్మికుల రక్తంతో తడిసిందే.. ఈ ఎర్రెర్రని మేడే జెండా అన్నదే… కార్మికవర్గం భావన… 1886 మే 1న కార్మికుల సమ్మె అనంతరం నాటి పరిస్థితులను 1889లో పారిస్‌లో జరిగిన అంతర్జాతీయ కార్మిక సంఘాల మహాసభ సమీక్షించింది. మే 1న ఎనిమిది గంటల పనిదినం సాధనకై పోరాటదినంగా ప్రకటించింది. దీంతో 1886 మే 1 నుంచి అంతర్జాతీయ మేడే పరిగణనలోకి వచ్చింది.

Also Read:6 ఫైళ్లపై సంతకాలు చేసిన సీఎం కేసీఆర్

- Advertisement -