కాళేశ్వరం..వెట్‌ రన్‌ సక్సెస్..

433
kaleshwaram project
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం. తెలంగాణను కోటీ ఎకరాల మాగాణిగా మార్చడంలో కీలకమైన ఈ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కీలకఘట్టం ఆవిష్కృతమైంది. నీటిని ఎత్తిపోసేందుకు ఏర్పాటు చేసిన భారీ మోటర్లలో మొదటి మోటర్‌ వెట్‌ రన్‌ విజయవంతంగా ప్రారంభమైంది.

వెట్‌ రన్‌ను స్విచ్ఛాన్‌ చేసి ప్రారంభించారు సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్‌.నందిమేడారం సర్జ్‌పూల్‌ నుంచి మోటార్లు నీటిని ఎత్తిపోస్తున్నాయి. అక్కడి నుండి గోదావరి జలాలు లక్ష్మీపూర్‌ సర్జ్‌పూల్‌కు …లక్ష్మీపూర్‌ నుంచి ఎత్తిపోతల ద్వారా నీళ్లు మిడ్‌మానేరుకు చేరుకోనున్నాయి.

తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చడానికి సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ని చేపట్టారు. ఇందులో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ సస్యశ్యామలం కానుంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా 18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించడంతోపాటు మరో 18.82 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలనే లక్ష్యంతో చేపట్టారు. రోజుకు ఒక టీఎంసీ చొప్పున 90 రోజులపాటు 90 టీఎంసీలను ఎత్తిపోయడం ద్వారా రైతులు ఇకపై వర్షాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి రాదు.

- Advertisement -