చంద్రబాబుకు షాక్….కేసీఆర్ వ్యూహానికి జై కొట్టిన మమత బెనర్జీ

306
Mamatha Benarji Kcr Babu
- Advertisement -

ప్రధాని మోదీని ఎలాగైన గద్దె దించాలనే లక్ష్యంతో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీల నేతలందరిని ఏకతాటిపై తెచ్చేందుకు విఫల యత్నాలు చేస్తున్నారు. ఇటివలే ఆయన తలపెట్టిన 21పార్టీల సమావేశానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరకాకపోవడం పట్ల పలు అనుమానాలకు తావునిస్తుంది. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికే చంద్రబాబు ఇదంతా చేస్తున్నారని గ్రహించిన మమతా సమావేశం ప్రతిపాదనను వ్యతిరేకించకుండా ఫలితాల వెల్లడి తర్వాత సమావేశమైతే బాగుంటుందని వ్యూహాత్మకంగా సూచించినట్లు భావిస్తున్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం మమతా బెనర్జీకి ఇష్టం లేదని పలువురు నేతలు బహిర్గంగా చెప్పిన విషయం తెలిసిందే.

అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన ఫెడరల్ ఫ్రంట్ వైపు మమతా చూస్తున్నట్లు తెలుస్తుంది. ప్రాంతియ పార్టీలతో కలిసి కేంద్రంలో ప్రభత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఆయన ఆలోచనకు దీదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ప్రాంతీయ పార్టీల హవా ఉండటంతో ఫెడరల్ ఫ్రంట్ విజయం సాధిస్తే దక్షిణాది నుంచే ప్రధానిని ఎన్నుకొనున్నట్లు తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అఖిలేష్, మాయావతి కూటమి ఎక్కువ సీట్లు సాధిస్తుందని కూడా ఆయన అంచనా వేస్తున్నట్లు చెబుతున్నారు.

మరో వైపు ఏపీలో జగన్ కూడా కేసీఆర్ వైపే ఉన్నారు. ఏపీలో మొత్తం 25పార్లమెంట్ సీట్లు ఉండగా, తెలంగాణలో 17, ఉత్తరప్రదేశ్ లో 80, ఒడిశాలో 21, పశ్చిమ బెంగాల్ లో 42, మొత్తం 185 లోకసభ స్థానాలున్నాయి. ఈసారి యూపీలో మాయవతి, అఖిలేష్‌ యాదవ్ కలిసిపోవడంతో బీజేపీకి అన్ని సీట్లు రాకపోవచ్చని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. ఈ స్థితిలో యుపిఎ భాగస్వామ్య పక్షాలు కూడా రాహుల్ గాంధీ కాకుండా మరో నేతను ప్రధానిగా ఎంచుకునే అవకాశం ఉంటుందని కేసిఆర్ అంచనా వేస్తున్నారు.

- Advertisement -