అన్నారం పంప్ హౌస్‌కు భారీగా చేరుతున్న నీరు..

372
kaleswaram
- Advertisement -

తెలంగాణ వరప్రధాయని కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద గోదారమ్మ నీటితో కలకల లాడుతుంది. గోదావరిలో కలుస్తున్న ప్రాణహిత వరదనీటి ప్రవాహాంతో కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపురేఖలు మారిపోయాయి. నీటి ప్రవాహంతో గోదావరి నీరు ఉరకలెత్తుతోంది. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం మెడిగడ్డ బ్యారేజ్ 85 గేట్లు మొత్తం మూసివేశారు.గేట్లు మూసివేయడంతో అక్కడ నీటి మట్టం 94 మీటర్లకు చేరుకుంది.

annaram

కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద 96 మీటర్ల వరకు నీరు నిలవడంతో 6వ పంపు ,3వ పంపుతో నీరు ఎత్తి పోస్తున్నారు. ఈ నీరు గ్రావిటీ కెనాల్ ద్వారా 13.5 కిమి ప్రయాణించి అన్నారం బ్యారేజ్‌లోకి చేరుకుంటున్నాయి. ప్రస్తుతం అన్నారం బ్యారేజిలో 6.6 మీటర్ల జలాలు చేరుకున్నాయి. అన్నారం పంప్ హౌస్‌కు 11 కిలో మీటర్ల దూరంలో ఉన్నాయి. అంటే అన్నారం బ్యారేజ్ నుండి బ్యాక్ వాటర్ గోదావరి పొడవునా 21 కిమి దూరానికి వెళ్ళాయి.

- Advertisement -