వివి వినాయక్ హీరో లుక్ అదుర్స్

234
vinayak
- Advertisement -

వివి వినాయక్ టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. చాలా మంది హీరోలకు తమ లైఫ్ గుర్తుండిపోయేలా మూవీని తెరకెక్కించారు. అయితే ఇటివలే ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో నిరాశ లో ఉన్నాడు. ఇక దర్శకత్వాన్ని వదిలేసి నటనపై దృష్టి పెట్టాడు వినాయక్.

వినాయక్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతుంది. శరభ ఫేం నరసంహారావు డైరెక్షన్‌లో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు వినాయక్. అయితే ఇన్ని రోజులు లావుగా ఉన్న వినాయక్ కాస్త సన్నగా అయిపోయారు. తన డెబ్యూ చిత్రం కోసం కొత్త లుక్‌లో కనిపించేందుకు జిమ్‌లో కసరత్తులు చేస్తున్నాడు.

వినాయక్ జిమ్ లో వర్కవుట్ చేస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వినాయక్ అప్పటి కంటే చాలా లావు తగ్గి..బాడీ కూడా చాలా ఫిట్ గా కనిపిస్తోంది. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ చిత్రం సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తుంది. వినాయక్ కు స్క్రీన్ మీద కనిపించడం ఇదేమి కొత్త కాదు…గతంలో ఆయన దర్శకత్వం వహించిన ఠాగూర్, ఖైదీ నంబర్ 150లో అదితి పాత్రలో నటించారు. దర్శకుడిగా సక్సెస్ సాధించిన వినాయక్ మరి హీరోగా విజయం సాధిస్తాడో లేదో చూడాలి.

- Advertisement -