ఏపీ పోలీసులను తాకిన టిక్‌టాక్…

633
ap police tik tok
- Advertisement -

టిక్ టాక్ పైత్యం ఏపీ పోలీసులకు తాకింది. మహిళలకు రక్షణ కల్పించే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం శక్తి టీమ్స్ పేరుతో ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటుచేసింది. అయితే ప్రజలకు రక్షణ కల్పించాల్సిన శక్తి టీమ్ పోలీసులు విధులు మానేసి టిక్‌టాక్ వీడియోలు చేశారు. యూనిఫామ్‌లో ఉండగానే ప్రభుత్వ వాహనంలోనే జబర్దస్త్ డైలాగులకు, సినిమా పాటలకు పేరడీలు చేస్తూ కాలక్షేపం చేశారు. ఈ వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో ఇంకేముంది అడ్డంగా బుక్కయ్యారు.

ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు విధులు మానేసి టిక్‌టాక్ వీడియోలు తీసుకోవడంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. విధుల్లో నిర్లక్ష్యం వహించేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఎందరో యువకుల ప్రాణాలు పోవడానికి, ఎందరో ఉద్యోగుల జీవితాలు రోడ్డు మీద పడటానికి టిక్ టాక్ కారణమవుతోంది. ఇటీవల ఖమ్మం కార్పోరేషన్ ఉద్యోగులు, గాంధీ ఆస్పత్రిలో పిజియోథెరపీ స్టూడెంట్స్ టిక్‌టాక్ చేసి చిక్కుల్లో పడ్డారు. తాజాగా ఇప్పుడు ఏపీ పోలీసులు కూడా టిక్ టాక్ చేస్తూ చిక్కుల్లో పడ్డారు.

- Advertisement -