విరాట్‌ కోసం ఈ వీరాభిమాని ఏం చేశాడో చూడండి..!

510
virat
- Advertisement -

భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి ఎంతోమంది అభిమానులు ఉంటారు. ఇందులో కొందరు విరాట్‌ వీరాభినులు కూడా ఉంటారు. వారు విరాట్‌ కోహ్లీ కోసం రకరకాల వేశాధారణతో, హెయిర్‌ స్టైల్‌తో తమ అభిమానాన్ని చాటుకుంటుంటారు. అయితే ఇటీవల ముంబాయి వాంఖడే స్టేడియంలో భారత్‌, ఆస్ట్రేలియాల మధ్య తొలి వన్డే జరుగుతున్న సమయంలో కోహ్లీ వీరాభిమని ఒకరు వెరైటీ హెయిర్‌ స్టైల్‌తో దర్శనమిచ్చాడు. virat fan

ఈ అభిమాని పేరు చిరాగ్‌ ఖిలారే. ఇతను వినూత్నంగా తన తల వెనుకభాగంలో విరాట్‌ కోహ్లి ముఖ చిత్రాన్ని అచ్చుగుద్దినట్లు తీర్చిదిద్దుకొని వచ్చాడు. చిరాగ్‌ ఈ చిత్రాన్ని తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. ది బెస్ట్‌ ఐయామ్‌ కోహ్లి ఫ్రమ్‌ హార్ట్‌ టు హెడ్‌, విరాటియన్‌ చిరాగ్‌ అని క్యాప్షన్‌ ఇచ్చాడు.ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

 

- Advertisement -