బ్యాటింగ్ మ్యాస్ట్రో కోహ్లీ@28

605
Virat Kohli turns 28
- Advertisement -

టీమిండియా బ్యాటింగ్ సంచలనం విరాట్ కోహ్లీ 29వ ఏట అడుగుపెట్టాడు. అద్భుతమైన ఫామ్ లో ఉన్న కోహ్లీ పరుగుల యంత్రంలా అన్ని ఫార్మాట్లలోనూ విజృంభించాడు. టెస్టు జట్టు కెప్టెన్ గానూ టీమిండియాకు చిరస్మరణీయమైన విజయాలను అందించాడు. సచిన్‌లోని సాంకేతికత.. గంగూలీలోని దూకుడు.. ద్రవిడ్‌లోని నిలకడ.. లక్ష్మణ్‌లోని సొగసు..విధ్వంసాన్నీ కళాత్మాకంగా మార్చివేయడం కోహ్లీకే చెల్లింది. ఏ ఆర్డర్‌లోనైనా బ్యాటింగ్‌కు దిగే కోహ్లి….ఛేజింగ్‌లో తనదైన మార్క్‌ క్రియేట్ చేశాడు. ప్రత్యర్థి ఏ జట్టైనా…ఛేజింగ్‌లో కోహ్లీ ముందు బలాదూర్ కావాల్సిందే. ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న చీకూ(కోహ్లీ)కి greattelangaana.com ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

Virat Kohli turns 28

ఫార్మాట్‌ ఏదైనా ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ పరుగుల వరద పారిస్తున్న భారత స్టార్‌ బ్యాట్స్ మెన్‌ విరాట్‌ కోహ్లి కెరీర్‌లో తొలి ద్విశతకం సాధించిన ఆనందంలో మళ్లీ మైదానంలో ముద్దులను తెరపైకి తీసుకొచ్చాడు. రెండేళ్ల క్రితం శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో అర్ధశతకం సాధించిన తర్వాత గ్యాలరీ నుంచి మ్యాచ్‌ను వీక్షిస్తున్న తన ప్రియురాలు అనుష్క శర్మకి బ్యాట్‌తో గాల్లో ముద్దులు పంపి అందరి దృష్టిని ఆకర్షించాడు.

Virat Kohli turns 28

టీ20, వన్డే, టెస్ట్‌.. ఫార్మాటేదైనా పరుగుల వరద పారించే కోహ్లీకి క్రికెట్‌ అంటే ఇష్టం కాదు.. పిచ్చి. తనను నమ్ముకున్న దిల్లీ జట్టును (రంజీలో) ఓటమి నుంచి గట్టెక్కించేందుకు ఒకటిన్నర రోజులు క్రీజులో నిలబడి కన్నతండ్రి అంత్యక్రియలకు ఆలస్యంగా వెళ్లేంత మమకారం.. అభిరుచి అతడిది. అందుకే తనిప్పుడు ‘టీమిండియాకు వెన్నెముక’. 2008లో మలేసియాలో జరిగిన అండర్‌-19 ప్రపంచకప్‌ను సాధించడంతో కోహ్లీ అందరి దృష్టినీ ఆకర్షించి అదే ఏడాదిలో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. 2009లో వన్‌డౌన్‌లో స్థానం పదిలం చేసుకున్నాడు. భారత్‌ తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా 1000, 3000, 4000 చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. కోహ్లీ బ్యాటింగ్‌ మాటల్లో చెప్పలేనంత కళాత్మకంగా సాగుతుంది.

Virat Kohli turns 28

టీ20లకొస్తే రారాజు. ఈ ఏడాది భారత్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో అతడి ఆట నిరుపమానం. వ్యాపార సంస్థలతో ఒప్పందాల్లో విరాట్‌ కోహ్లీ భారత్‌లో అందర్నీ మించిపోయాడు. 2015 ఫోర్బ్స్‌ జాబితా ప్రకారం అతడి ఏడాది ఆదాయం రూ.104.78 కోట్లు.

Virat Kohli turns 28

వన్డే ఫార్మాట్లో విరాట్ 25 సెంచరీలు పూర్తి చేశాడు. అంతేగాక వేగంగా 7500 పరుగులు చేసిన బ్యాట్స్ మన్ గా నిలిచాడు. ఇక వన్డేల్లో ఛేజింగ్ చేసి గెలిచిన మ్యాచ్ ల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్ మన్ గా విరాట్.. బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (14) రికార్డును సమం చేశాడు.

Virat Kohli turns 28

ఆసియా కప్ టి-20 టైటిల్ సాధించడంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. టి-20 ప్రపంచ కప్ లో విరాట్ ఐదు మ్యాచ్ ల్లో 273 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గా నిలిచాడు.

Virat Kohli turns 28

ఐపీఎల్ లో ఓ సీజన్ లో 900 పరుగుల మార్క్ దాటిన తొలి బ్యాట్స్ మన్ గా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. అలాగే ఓ ఐపీఎల్ సీజన్ లో అ‍త్యధిక సెంచరీలు (4) చేసిన బ్యాట్స్ మన్ గా మరో ఘనత సాధించాడు.

Virat Kohli turns 28

ఇక టెస్టుల్లోనూ విరాట్ తనదైన ముద్ర వేశాడు. వెస్టిండీస్, న్యూజిలాండ్ లతో సిరీస్ లలో విరాట్ రెండు డబుల్ సెంచరీలు చేశాడు. టెస్టు క్రికెట్ లో రెండు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక టీమిండియా కెప్టెన్ కోహ్లీయే.

Virat Kohli turns 28

కోహ్లీ గురించి…

* మెచ్చే సినిమాలు : త్రీ ఇడియట్స్‌, రాకీ 4
* నచ్చే విహారం : ఆస్ట్రేలియా
* ఇష్టపడే వంటలు: జపనీస్‌
* వస్త్రధారణ: ట్రాక్‌ప్యాంట్స్‌, టీ షర్ట్స్‌, స్నీకర్స్‌
* స్టైల్‌ ఐకాన్‌: జస్టిన్‌ టింబర్‌లేక్‌
* సంగీతం: ఉత్తర భారత సంగీతం. ఎక్కువగా పంజాబీ పాటలు
* గాయకుడు: అస్రార్‌
* స్కూల్లో సబ్జెక్ట్‌: చరిత్ర, గణితమంటే అయిష్టం
* వంట వచ్చా: సలాడ్స్‌ చేయడం వచ్చు
* టాటూ: సమురాయ్‌
* ఐపీఎల్‌ సహచరులు: క్రిస్‌గేల్‌, ఏబీ డివిలియర్స్‌
* ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌: యమా యాక్టివ్‌

Virat Kohli turns 28

Virat Kohli turns 28

Virat Kohli turns 28

Virat Kohli turns 28

Virat Kohli turns 28

- Advertisement -