క్రికెట్ అంటే ప్రాణం..రికార్డులపై ఆశలేదు:విరాట్

330
virat
- Advertisement -

క్రికెట్ అంటే తనకు ప్రాణమని..రికార్డులపై ఆశలేదని స్పష్టం చేశాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి. వన్డేల్లో 10 వేల పరుగులు సాధించిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన కోహ్లీ..తాను దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని, ఎవరి మెప్పు కోసమో ఆడటం లేదన్నాడు. అంతర్జాతీయ స్థాయిలో ఒక్కో పరుగు చేయాలంటే ఎంతో కష్టపడాలి. టీమ్‌ఇండియాకు
ఆడాలని చాలా మంది కలలుగంటారు. ఇప్పుడు అదే స్థానంలో ఉన్న మనం మరింత కసితో, పరుగుల దాహంతో ఆడాలని సూచించాడు.

వన్డేల్లో ఈ ఫీట్ సాధించడం చాలా సంతోషంగా ఉందని.. నేను ఎంతో అదృష్టవంతుడి. నా వన్డే కెరీర్‌లో ఈ స్థాయికి చేరుకుంటానని ఊహించలేదన్నారు. టీమిండియా ప్రయోజనాలే తనకు ముఖ్యమని తెలిపాడు.

జట్టు విజయం కోసం ఎన్ని ఓవర్లయినా ఆడేందుకు సిద్ధంగా ఉన్నా. నేను ఎవరికి మేలు చేయడం కోసమో ఆడటం లేదు. ఎవరి కోసమో నేను నిరూపించాల్సిన అవసరం లేదన్నాడు. జట్టు కోసం ఓవర్‌లో ఆరు బంతులకూ డైవ్ చేస్తా. అది నా బాధ్యత, కర్తవ్యం. అందుకే ఈ దేశం తరఫున నన్ను ఎంపిక చేశారని తెలిపాడు.

- Advertisement -