కీవిస్ కెప్టెన్‌పై కోహ్లీ ప్రశంసలు

406
kohli
- Advertisement -

న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌పై మరోసారి ప్రశంసలు గుప్పించాడు టీమిండియా సారధి విరాట్ కోహ్లీ. విలియమ్సన్ బ్యాటింగ్ సామర్ధ్యం అసాధారణమని…ప్రపంచ క్రికెట్‌లో విలియమ్సన్‌ చాలా స్మార్ట్‌ క్రికెటర్‌ అని ప్రశంసించాడు.

కెప్టెన్‌గా విలియమ్సన్‌ది ప్రత్యేక శైలీ అని కొనియాడాడు. ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కీవిస్ ఓడిపోయినప్పటికీ అది విలియమ్సన్ వైఫల్యం కాదని జట్టు సాధించే ఫలితాల్ని బట్టి నాయకత్వ లక్షణాలను నిర్ణయించలేమన్నాడు.

న్యూజిలాండ్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లను గెలవడంపైనే తాము దృష్టి సారించామని చెప్పాడు. శుక్రవారం నుంచి భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య సిరీస్‌ ఆరంభం కానుండగా ఐదు టీ20ల సిరీస్‌తో పాటు మూడు వన్డేల సిరీస్‌, రెండు టెస్టులను ఇరు జట్లు ఆడనున్నాయి.

- Advertisement -