టాప్ లెస్ ఫోటోను షేర్‌ చేసిన కోహ్లీ.. వైరల్‌

271
kohli

ఇటీవల వెస్టిండీస్ టూర్‌లో అన్ని సిరీస్‌లను టీమిండియానే గెలవడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆనందంలో ఉన్నాడు. యువ ఆటగాళ్లు రాణిస్తుండడంతో కోహ్లీకి పెద్దగా ఈ టూర్‌లో సవాళ్లు ఎదురుకాలేదు. ఇక వెస్టిండీస్ పర్యటన ముగియగానే కోహ్లీ వెకేషన్‌కు వెళ్లిపోయాడు. తనకిష్టమైన విదేశాల్లో సేదతీరుతున్నాడు.

ఇందులో భాగంగా తాజాగా ఓ ఫొటో షూట్‌లో ఒంటిపై కేవలం నిక్కరుతో ఫొటోలకు ఫోజిచ్చాడు. ఆ ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేసిన విరాట్ తన బాధనంతా ఒక్క మెసేజ్‌లో తెలిపాడు.. ‘మనకున్న పరిమితుల్లోనే మనం జీవించగలిగితే.. బయటి నుంచి ఏదీ అవసరం లేదు’ అంటూ హితబోధ చేశారు. ప్రస్తుతం కోహ్లీ సోషల్ మీడియాలో షేర్‌ చేసిన ఈ షోటో వైరల్ అయింది.

ఈ ఫోటోపై సోషల్ మీడియాలో నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు. “కోహ్లీ.. ట్రాఫిక్‌ పోలీసులు ఎంత చలానా వేశారేంటి?” అని ఒక నెటిజన్ ట్వీట్ చేయగా… మరొక నెటిజన్ “విరాట్‌ కోహ్లీ ఇప్పుడు ఎంత చలానా చెల్లించాడో” అని ట్వీట్ చేశాడు. రెండు రోజుల క్రితం ఢిల్లీలో ట్రాఫిక్‌ పోలీసులు హెల్మెట్‌ పెట్టుకోలేదని ఓ వ్యక్తికి రూ.23,000 చలాన్ వేసిన సంగతి తెలిసిందే.