విరాట్ కోహ్లి అతి చేష్టలు..జరిమానా విధించిన ఐసీసీ

102
Kohli Umpire

ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి జరిమానా విధించింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి. వరల్డ్ కప్ మ్యాచ్ లలో భాగంగా శనివారం నాడు ఆఫ్గనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో అంపైర్లతో వాగ్వాదానికి దిగడంతో కోహ్లి కి మ్యాచ్ ఫీజులో 25శాతం జరిమానా విధించింది. ఆఫ్ఘనిస్తాన్‌ బ్యాటింగ్‌లో ఇన్నింగ్స్‌ 29వ ఓవర్లో రెహ్మత్‌ షా బ్యాటింగ్‌ చేస్తుండగా భారత బౌలర్‌ షమీ వేసిన బంతి బ్యాట్స్‌మెన్‌ లెగ్స్‌కు తాకిందంటూ భారత ఆటగాళ్లందరూ అంపైర్‌ వద్దకు వచ్చారు.

ఈ క్రమంలో అలీందర్‌ అనే అంపైరుతో కోహ్లి కొంచెం దూకుడుగా ప్రవర్తించాడు. బంతి వికెట్‌పైకి వెళ్లేది అంటూ వాదించాడు. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈఫోటోను పరిశీలించింది ఐసీసీ. ఐసీసీ నియమావళి లెవల్‌-1ను కోహ్లి అతిక్రమించిన కారణంగా జరిమానా విధిస్తూ మ్యాచ్‌ రిఫరీ క్రిస్‌ బ్రాడ్‌ నిర్ణయం తీసుకున్నారు.