F2 డైరెక్టర్‌తో “వినరా సోదరా వీరకుమారా”..

226
- Advertisement -

లక్ష్మణ్ సినీ విజన్స్ పతాకం పై శ్రీనివాస సాయి ,ప్రియాంక జైన్ హీరోహీరోయిన్లుగా సతీష్ చంద్ర నాదెళ్ల దర్శకత్వంలో ,లక్ష్మణ్ క్యాదారి నిర్మించిన చిత్రం ‘ వినరా సోదర వీరకుమారా’ .ఈ చిత్రం ఫస్ట్ సాంగ్‌ను ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఇటీవల హైదరాబాద్‌లో లాంచ్ చేసారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ తో పాటు ప్రముఖ నిర్మాత బెక్కం వేణు గోపాల్ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ” వినరా సోదర వీరకుమారా ట్రైలర్ చూశాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సాంగ్స్ కూడా చాల బాగున్నాయి. ఈ సినిమా హిట్ అవుతుందని ఆశిస్తూ, టీమ్ మొత్తానికి నా విషెస్ తెలియజేస్తున్నాను.’ అన్నారు.

Vinara Sodara Veera Kumara

ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ ‘ఈ ప్రొడ్యూసర్ లక్ష్మణ్ నేను కలసి మేం వయసుకి వచ్చాము మూవీ చేశాం. ఈ చిత్ర టీం కొత్త ప్రయత్నం చేశారు. మూవీ చాలా బాగుంది. దర్శకుడు అనిల్‌తో సాంగ్ లాంచ్ చేయడం శుభ పరిణామం ‘ అని అన్నారు.

చిత్ర నిర్మాత లక్ష్మణ్ మాట్లాడుతూ” మా సినిమా మొదటి పాటను అనిల్ రావిపూడి రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను ‘ అన్నారు.

 

( మెస్ట్ డిజైరబుల్ ఉమెన్..వీళ్లే అట)  https://goo.gl/DG7kx2

ఇంకా ఈ కార్యక్రమంలో హీరో శ్రీనివాస సాయి, చిత్ర దర్శకుడు సతీష్ చంద్ర నాదెళ్ల, అనిల్ మైలాపురం, కిరణ్ .సి.హెచ్. తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస సాయి, ప్రియంకజైన్, జాన్సీ, ఉత్తేజ్, జెమిని సురేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: రవి.వి, సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, మాటలు: లక్ష్మీ భూపాల, ఎడిటర్ :మార్తాండ్ .కె.. వెంకటేష్. నిర్మాత: లక్ష్మణ్ క్యాదారీ, దర్శకత్వం: సతీష్ చంద్ర నాదెళ్ల.

- Advertisement -