తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే మెతుకు ఆనంద్

572
mla Methuku anand
- Advertisement -

వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండలంలోని తాహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్. తహసిల్దారు పట్డాదరు పాసు పుస్తకాలు ఇవ్వడం లేదని, కళ్యాణ లక్ష్మీ, షాదీముభారక్ పథకాలలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణల నేపథ్యంలోమోమిన్పేట్ తాసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు ఎమ్మెల్యే. ఈసందర్భంగా అక్కడ ఉన్న ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

తహసిల్దార్ కార్యాలయంలో చేయవలసిన కంప్యూటర్ ఆపరేటర్ను ధరణి వెబ్ సైట్ ను తహసిల్దార్ సంధ్యారాణి హైదరాబాదు లోని తన నివాసంలో పెట్టకుని కార్యాలయానికి రాకుండా అక్కడి నుండి తాసిల్దార్ కార్యాలయం పనులు చూస్తున్నారని డబ్బులు ఎవరు ఇస్తే వారి పనులు చేస్తున్నారని ప్రజల నుండి ఆరోపణలు రావటంతో ఎమ్మెల్యే ఆనంద్  తహసిల్దార్ ను ప్రశ్నించారు. కార్యాలయనికి తహసిల్దార్ సంధ్యారాణి ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నారని సిబ్బందిని ప్రశ్నించడంతో వారంలో ఒకటి లేదా రెండు రోజులు వస్తున్నారని మహిళ వీఆర్ఏలు ఎమ్మెల్యేకు చెప్పారు.

తహసిల్దార్ కార్యాలయానికి రాకపోవడంతో డిప్యూటీ తహసిల్దార్ రవిందర్ దత్తు తమను వేధిస్తున్నాడని కార్యాలయంలో పనిచేస్తున్న మహిళ విఆర్ఏలు ఎమ్మెల్యే కు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తహసిల్దార్ సంధ్యారాణి వ్యవహారంపై అసహనం వ్యక్తం చేశారు.అనంతరం జిల్లా కలెక్టర్ తో పోన్ లో మాట్లాడి మోమిన్పేట్ తాసిల్దార్ కార్యాలయంలో జరుగుతున్న వ్యవహారాలపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.

- Advertisement -