గుండెపోటుతో మాజీ ఎమ్మెల్యే మృతి.. కేసీఆర్ దిగ్భ్రాంతి..

474
kcr
- Advertisement -

వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే సంజీవరావు గుండెపోటుతో ఈ రోజు మృతి చెందారు. గుండెపోటుకు గురైన ఆయనను నిమ్స్ కు తరలించారు. చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. సంజీవరావు 2014లో వికారాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపుపొందారు. ఆయన స్వస్థలం నవాబుపేట మండలంలోని గేటు వనంపల్లి.

B Sanjeeva Rao passaway

ఇక సంజీవరావు ఆకస్మిక మృతి వార్త తెలియడంతో సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతికి గురయ్యారు. సంజీవరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థించినట్టు సీఎం కేసీఆర్ పేరిట తెలంగాణ సీఎంవో ట్వీట్ చేసింది. సంజీవరావు మృతి పట్ల పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు.

- Advertisement -