ఆ ఫ్లాప్‌కు నేనే కారణం: విజయేంద్ర ప్రసాద్

235
- Advertisement -

‘భజరంగీ భాయ్ జాన్, బాహుబలి’ వంటి భారీ సినిమాలకు కథలందించి, దేశవ్యాప్త గుర్తింపు సాధించిన రచయిత విజయేంద్రప్రసాద్ రైటర్‌గా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రత్యేకించి కొడుకు రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలకు విజయేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు ‘మణికర్ణిక’ వంటి భారీ సినిమాకు కథను అందిస్తున్నది కూడా ఆయనే. రచయితగా దూసుకుపోతున్న ఆయన స్వయంగా దర్శకత్వం వహించిన చిత్రం ‘శ్రీవల్లి’.

srivalli

ఇటీవలే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా జోనర్ సాధారణమైన ప్రేక్షకులకు అర్థం కాలేదు .. కాన్సెప్ట్ వారిని ఆకట్టుకోలేకపోవడంతో  ఈ సినిమా థీయేటర్లలో నిలబడలేకపోయింది.

తాజాగా ఈ సినిమా గురించి విజయేంద్ర ప్రసాద్ మాట్లాడారు. ఈ సినిమా కథ ఆసక్తికరమైనదేననీ .. ఆకట్టుకునేదేనని ఆయన అన్నారు. తనని నమ్మి నిర్మాతలు కూడా ఖర్చుకు వెనకాడలేదని చెప్పారు. అందరూ బాగానే పనిచేశారన్న విజయేంద్ర ప్రసాద్.. సరిగ్గా చేయలేనిది తానేనని ఒప్పుకున్నారు. కథపై నాకు నమ్మకం వుందని, అయినా అనుకున్న స్థాయిలో తీసుకురాలేకపోయానన్నారు. అందుకు నిర్మాతలకు క్షమాపణలు తెలియజేస్తున్నానన్నారు. అందుకు పరిహారంగా నిర్మాతలకు తాను ఎప్పుడైన సహాయం చేస్తానని తెలిపారు.

- Advertisement -