వరల్డ్ కప్ నుంచి విజయ్ శంకర్ అవుట్..

114
Viajay Shankar

ఐసీసీ ప్రపంచకప్ లో భాగంగా ఇండియా ప్లేయర్లు వరుసగా గాయాలపాలవుతున్నారు. ఓపెనర్ శిఖర్ ధావన్ ఇప్పటికే టోర్నీ మొత్తానికి దూరమవ్వగా… భువనేశ్వర్ కూడా గాయంతో కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. తాజాగా ఆల్ రౌండర్ విజయ్ శంకర్ కూడా వరల్డ్ కప్ కు దూరమయ్యాడు.

విజయ్ బొటనవేలుకి గాయం కారణంగా అతను త్వరలో జరిగే అన్ని మ్యాచ్ లకు దూరంగా ఉండనున్నాడు. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బుమ్రా వేసిన బంతి మరోసారి విజయ్ శంకర్ బొటనవేలికి తగిలిందని అతను ఆడేందుకు పూర్తి ఫిట్‌గా లేకపోవడం వల్లే తిరిగి వెళ్లిపోతున్నాడని మేనేజ్‌మెంట్ పేర్కొంది. అతని స్థానంలో మయాంక్ అగర్వాల్‌ను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది.