విలన్‌గా హీరో విజయ్‌..!

475
vijay
- Advertisement -

తమిళ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం అట్లీ కుమార్ దర్శకత్వంలో ‘బిగిల్’ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. ఆ చిత్రం షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. త్వరలోనే ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలోనే విజయ్ తన తదుపరి చిత్రంను యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. అయితే ఇందులో విజయ్‌ సేతుపతి విజయ్‌తో విలన్‌గా తలపడటానికి సిద్ధమవుతున్నట్టుగా కోలీవుడ్ సమాచారం.

vijay-sethupathi

ఇక విజయ్ సేతుపతికి తమిళనాట విలక్షణ నటుడు అనే పేరున్న సంగతి విదీతమే. పాత్రలో కొత్తదనానికి మాత్రమే ఆయన ప్రాధాన్యతనిస్తాడు. అందువల్లనే ఒక వైపున హీరోగా చేస్తూనే, మరో వైపున ముఖ్యమైన .. కీలకమైన పాత్రలను పోషిస్తుంటాడు. ఈ తరహా పాత్రల్లో ఇతర భాషా చిత్రాల్లో చేయడానికి కూడా ఆయన ఉత్సాహాన్ని చూపుతుంటాడు. ఈ మూవీలో విలన్‌గా దాదాపు ఆయననే కన్ఫాం అయిట్లు టాక్ వినిపిస్తోంది. ఇది ఎంత వరకు నిజమో చూడాలి మరి.

- Advertisement -