అల్లు అర్జున్ కు విలన్ గా విజయ్ సేతుపతి?

568
Allu Arjun Vijay Sethupathi
- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అల..వైకుంఠపురంలో సినిమాలో బిజీగా ఉన్నాడు. పూజా హెగ్డె హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అల్లు అరవింద్, రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు.

కాగా అల్లు అర్జున్ తర్వాతి మూవీ సుకుమార్ దర్శకత్వంలో చేయనున్నాడు. సుకుమార్ తో అల్లు అర్జున్ కు ఇది మూడవ సినిమా కావడం విశేషం. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆర్య, ఆర్య2 సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరి కలిసి ముచ్చటగా మూడో సినిమా చేయబోతున్నారు. ఫిబ్రవరి నుంచి ఈమూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభంకానుంది.

ప్రస్తుతం ఈమూవీ స్క్రీప్ట్ పనిలో బిజీగా ఉన్నాడు సుకుమార్. ఈమూవీలో విలన్ రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉండనుందట. ఈ పాత్రకి తమిళ హీరో విజయ్ సేతుపతిని తీసుకోవాలని అనుకుంటున్నారట చిత్రయూనిట్. తమిల్ లో విజయ్ కి మంచి క్రేజ్ ఉండటంతో ఈసినిమాను తమిళ్ లో కూడా విడుదల చేయాలని భావిస్తున్నారు. కాగా విజయ్ సేతుపతి మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

- Advertisement -