అల్లు అర్జున్‌కు విజయ్‌ దేవరకొండ గిఫ్ట్‌..!

347
Vijay-Deverakonda
- Advertisement -

టాలీవుడ్‌ హీరో స్టైలీస్‌స్టార్‌ అల్లు అర్జున్‌కు విజయ్‌ దేవరకొండ కొత్త దుస్తులు పంపాడు. విజ‌య్ రౌడీ అనే బ్రాండ్‌ని క్రియేట్ చేసి దాంతో కొత్త ర‌కాల దుస్తుల‌ని మార్కెట్‌లోకి తెస్తున్న విషయం తెలిసిందే. విజయ్‌ బట్టలు పంపిన ఈ విషయాన్ని బన్నీ తన ట్విట్టర్ ఖాతాలో తెలుపుతూ ఇందుకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశాడు.

‘నీకు చాలా కృతజ్ఞతలు సోదరా. ఇదో మధురానుభూతి.. నువ్వు చెప్పిన‌ట్టుగానే బ‌ట్ట‌లు పంపావు. ఈ డ్రెస్‌ను వేసుకొని అల వైకుంఠ‌పుర‌ములో సినిమా సెల‌బ్రేష‌న్‌కి వస్తా’ అని అల్లు అర్జున్‌ తెలిపాడు. ఈ మూవీ జనవరి 12 న గ్రాండ్‌గా విడుద‌ల కానుంది. ఇక‌, విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. జ‌న‌వ‌రిలో ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

- Advertisement -