విజ‌య్ దేవ‌ర‌కొండ ‘డియ‌ర్ కామ్రేడ్’..

437
vijay devarakonda, rashmika
- Advertisement -

పెళ్లి చూపులు సినిమాతో తెలుగు తెర‌కు హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఆ త‌రువాత వ‌చ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో ట్రెండ్ క్రియేట్ చేశాడు. ప్ర‌స్తుతం ఆయ‌న మూడు సినిమాలు చేస్తూ బిజీగా గ‌డుపుతున్నాడు. అతి త‌క్కువ కాలంలో ఎక్కువ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఇక విజ‌య్ దేవ‌ర‌కొండ కొత్త చిత్రం డియ‌ర్ కామ్రేడ్. ఈచిత్రానికి నేడు పూజా కార్యక్రామాలు నిర్వ‌హించారు.

dear comrade

ఈకార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులు మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎం.ఎం కిర‌వాణి, డైరెక్ట‌ర్లు సుకుమార్, కొర‌టాల శివ‌, చంద్ర‌శేఖ‌ర్ మేలేటి, ప‌లువురు పాల్గోన్నారు.తొలి సన్నివేశానికి ఎం.ఎం.కీరవాణి క్లాప్ కొట్టగా, డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి షాట్ భరత్ కమ్మ దర్శకత్వం వహించారు. సుకుమార్, కొరటాల శివ స్క్రిప్ట్ అందించారు.

dear comrade movi opening

ఈచిత్రానికి భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా..మైత్రి మూవీ మేక‌ర్స్, బిగ్ బెన్ బ్యాన‌ర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈసినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ కు జంట‌గా హీరోయిన్ గా ర‌ష్మిక మంద‌న్న న‌టిస్తోంది. త‌మిళ మ్యూజిక్ డైరెక్ట‌ర్ జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ సంగీతం అందించ‌నున్నారు. త్వ‌ర‌లోనే ఈమూవీ రెగ్యూల‌ర్ షూటింగ్ ను ప్రారంభించ‌నున్న‌ట్లు తెలిపారు ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు.

- Advertisement -