విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ ఫస్ట్ లుక్

270
- Advertisement -

పెళ్లి చూపులు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విజయ్ దేవరకొండ, అర్జున్ రెడ్డితో యూత్ ఐకాన్ గా మారిపోయాడు. విజయ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు విజయ్ టాక్సీవాలా సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. సైంటిపిక్ థ్రిరల్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ టాక్సీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాతో మరోసారి అర్జున్ రెడ్డి వంటి హిట్ అందుకుంటాడని ఫిలింనగర్ లో టాక్ వినిపిస్తోంది.

Vijay Devarakonda's 'Dear Comrade' First Look

మరోవైపు ఆయన కీలక పాత్ర పోషించిన ‘మహానటి’ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తిసురేష్ నటిస్తుండగా, మధురవాణిగా సమంత, విజయ్ ఆంటోనిగా విజయ్ దేవర కొండ ప్రేక్షకులను అలరించనున్నారు. ఇక పరశురామ్ దర్శకత్వంలో విజయ్ ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం చిత్ర యూనిట్ షూటింగ్ పూర్తి చేసుకునే పనిలో ఉంది.

Vijay Devarakonda's 'Dear Comrade' First Look

మరోవైపు తన తదపరి చిత్రాన్ని భరత్ కమ్మ అనే దర్శకుడితో ఓ సినిమా చేయడానికి సిద్దమయ్యాడు. ఈ సినిమాకి ‘డియర్ కామ్రేడ్’ అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు. ఈ మూవీలో హీరోయిన్ గా కొత్త అమ్మాయిను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.  విజయ్ దేవరకొండ పుట్టిన రోజు సందర్బంగా ఈరోజు ‘డియర్ కామ్రేడ్’ మూవీ నుండి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

- Advertisement -