ప్రేమికుల రోజున “వరల్డ్ ఫేమస్ లవర్ “

550
World-Famous-lover
- Advertisement -

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈమూవీకి క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించగా రాశిఖన్నా, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరో హీరోయిన్ క్యాథరిన్ థెస్రా కీలక పాత్రలో నటిస్తుంది. ప్రస్తుతం ఈమూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. నిర్మాత కె. వల్లభ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుంచి విజయ్ దేవరకొండ ఫస్ట్ లుక్ విడుదలైన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈమూవీ విడుదల తేదీని ప్రకటించారు చిత్రయూనిట్. ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14న వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపారు

ఈమూవీ సమర్పకుడు కె.ఎస్. రామారావు. ఇదో వైవిధ్యభరితమైన ప్రేమకథ. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రేమికుణ్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాం. అందుకు ప్రేమికుల రోజుకి మించిన మంచి రోజు లేదన్నారు. విజయ్ దేవరకొండ సినీ జీవితంలో ఈమూవీ ప్రత్యేకంగా నిలిచిపోతుందన్నారు.

కాగా విజయ్ దేవరకొండ ఈమూవీ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఇప్పటికే దర్శకుడు పూరీ పూర్తి కథను సిద్దం చేసి విజయ్ దేవరకొండ కోసం రెడీ గా ఉన్నాడు. ఈసినిమాను పూరీ సొంత బ్యానర్ లో నిర్మించనున్నారు. ఈమూవీకి ఫైటర్ అనే టైటిను ఖరారు చేశారు. విజయ్ సరసన హీరోయిన్ గా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ను ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. త్వరలోనే ఈమూవీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

- Advertisement -