సిక్స్ కొట్టాలనే ‘వరల్డ్ ఫేమస్ లవర్’గా చేశాను

326
wfl
- Advertisement -

విజయ్ దేవరకొండ హీరోగా కె.ఎస్. రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె.ఎ. వల్లభ నిర్మిస్తోన్న చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. క్రాంతిమాధవ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, క్యాథరిన్ ట్రెసా, ఇజాబెల్లా లెయితే హీరోయిన్లుగా నటించారు. ఫిబ్రవరి 14న వేలంటైన్స్ డే సందర్భంగా విడుదలవుతున్న ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ ఆదివారం రాత్రి నార్సింగిలో విజయ్ అభిమానుల కోలాహలం మధ్య అట్టహాసంగా జరిగింది.

హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, “నాలుగేళ్ల క్రితం 2016లో ‘పెళ్ళిచూపులు’ అనే సినిమాతో తొలిసారి ఒక లీడ్ యాక్టర్ గా మీ ముందుకు వచ్చా. ఇప్పటికి ఏడు సినిమాలు రిలీజయ్యాయి. ఇది నా తొమ్మిదో సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్. ఈ నాలుగేళ్లలో హిట్లు కొట్టినం. చేతి నుంచి జారిపోయి మిస్సయిన సినిమాలున్నాయి. ఈ జర్నీలో రెండే రెండు స్థిరమైనవి ఉన్నాయ్. ఒకటి – మీరు (ఫ్యాన్స్). విజయ్ అంటే ఎవ్వడికీ తెల్వదు. అట్లాంటిది 2016 నుంచి ఇప్పుడు 2020 వరకు మీరు నాతోడు వస్తూనే ఉన్నారు. మనం కలిసి ఇంకా చాలా చాలా చెయ్యబోతున్నాం. ఇది జస్ట్ ప్రారంభమే. ఈ సంవత్సరం నుంచి కొత్త దశలోకి ఎంటరవుతున్నాం. రెండోది – నేను సిక్స్ కొట్టాలనే దిగుతా. ఈ సింగిల్, డబుల్ అనేది నాకు ఓపిక లేదు. కొడితే స్టేడియం బయటకు కొట్టాలని బ్యాట్ ఊపుతా. ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ చేసిన. తమిళ్ రాకున్నా నేర్చుకొని, ‘నోటా’ చేసిన. ‘డియర్ కామ్రేడ్’ సినిమాను ఐదు రాష్ట్రాల్లో రిలీజ్ చెయ్యాలని నాలుగు భాషల్లో రిలీజ్ చేస్తూ, నేర్చుకున్నాం. ఊరూరూ తిరిగి మ్యూజిక్ కాన్సర్ట్స్ చేశాం. కొన్ని స్టేడియం బయట పడ్డాయి, కొన్ని బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ లు పడ్డాయి. కానీ భయమైతే లేదు. ఎప్పుడు దిగినా సిక్స్ కొట్టాలనే దిగుతా.

ఇది నా లాస్ట్ లవ్ స్టోరీ అని మొన్న చెప్పిన. ఎందుకంటే నాకట్లా అనిపిస్తోంది. అంటే మనిషిలా మారుతున్నా. టేస్టులు మారుతున్నయి. సినిమాల్లో ఇంకో దశలోకి వెళ్తున్నా. లాస్ట్ లవ్ స్టోరీ చేసినప్పుడు అన్నీ కవర్ చెయ్యాలని మూడు రకాల మనుషుల్ని ఇందులో ప్లే చేసిన. మూడు రకాల ఆర్థిక స్థోమతలు, మూడు రకాల సిటీలు, నాలుగు రకాల ప్రేయసులు.. ఒక ఊరిలో ఉంటూ పెద్దగా చదువులేని బొగ్గుగనిలో పనిచేస్తూ భార్యాభర్తల ప్రేమకథ ఒకటైతే, దానికి పూర్తి విరుద్ధంగా వరల్డ్ బిగ్గెస్ట్ సిటీ ప్యారిస్ లో ఒక తెల్లపిల్లతో పైలెట్ గా ఇంకో ప్రేమకథ. హైదరాబాద్ లో కాలేజిలో ఒక అమ్మాయితో మరో ప్రేమకథ.. ఇన్ని విచిత్రమైన క్యారెక్టర్లు ఈ సినిమాలో చేసే స్క్రిప్టుతో క్రాంతిమాధవ్ నా దగ్గరకు వచ్చాడు. స్క్రిప్ట్ వినగానే ఇది నా ఫైనల్ లవ్ స్టోరీ అని ఫిక్సయి చేశా. ఇలాంటి క్యారెక్టర్ చేసే ఛాన్స్ నాకు మళ్లీ దొరకదు. ఎందుకంటే, బొగ్గుగనిలో శీనయ్య లాగా నేను ఉండను, అలా మాట్లాడలేను. అందుకే శీనయ్య రోల్ ను మస్తు ఎంజాయ్ చేశా. అలాగే ఒక ఫారిన్ పైలెట్ తో మనం రిలేషన్షిప్ లో ఉండం. అందుకే ప్యారిస్ ఎపిసోడ్ ను పూర్తిగా ఎంజాయ్ చేసిన. గౌతమ్ రోల్ మన లైఫ్ లో కొంచెం చూసినం. కానీ ఈ మూడు రోల్స్ ను ప్లే చేసేటప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. ఈ ఫిబ్రవరి 14న ఈ సినిమాకొచ్చి మీరందరూ ప్రేమలో పడతారనుకుంటున్నా. ఈ సినిమాతో మా ప్రొడ్యూసర్ కేఎస్ రామారావు గారికి సక్సెస్ వస్తుందని ఆశిస్తున్నా. ఇది క్రాంతిమాధవ్ సినిమా. మేమందరం యాక్టర్స్ అంతే. ఈ స్క్రిప్ట్, ఈ ఆత్మ, మొత్తం క్రాంతిది. ఈ సినిమా కోసం ఎంతో శ్రమించాడు. ఆయనకు అతిపెద్ద సక్సెస్ రావాలని ఆకాంక్షిస్తున్నా. గోపీసుందర్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సినిమాటోగ్రాఫర్ జయకృష్ణ గుమ్మడి చాలా హార్డ్ వర్క్ చేశాడు. ఇకనుంచీ సిక్సులు కొట్టడానికే చూస్తా. ఫ్యాన్స్ అందరికీ థాంక్స్” అని చెప్పారు.

- Advertisement -